ఫుట్‌బాల్‌కు ఆదరణ పెరుగుతోంది

21 Sep, 2017 12:31 IST|Sakshi
ఫుట్‌బాల్‌కు ఆదరణ పెరుగుతోంది

అక్కినేని అఖిల్‌ వ్యాఖ్య
హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా టాలీవుడ్‌ యువ హీరో

సాక్షి, హైదరాబాద్‌: క్రికెట్‌కు ఉన్న అమితాదరణ కారణంగా మన వద్ద ఫుట్‌బాల్‌కు తగిన గుర్తింపు దక్కలేదని, అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితిలో మార్పు వస్తోందని టాలీవుడ్‌ హీరో అక్కినేని అఖిల్‌ అభిప్రాయపడ్డాడు. పెద్ద సంఖ్యలో టోర్నీలు రావడంతో పాటు కార్పొరేట్‌లు కూడా ముందుకు వస్తుండటంతో ఫుట్‌బాల్‌కు మంచి ప్రాచుర్యం లభిస్తోందని అతను అన్నాడు. నవంబర్‌ 25 నుంచి నిర్వహించనున్న హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌కు అఖిల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు.

ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ  ‘నాకు వ్యక్తిగతంగా క్రికెట్‌ ఇష్టమే అయినా ఇతర క్రీడలకు కూడా అండగా నిలిచేందుకు నేను ఎప్పుడైనా సిద్ధం. అదే కారణంగా ఇప్పుడు ఫుట్‌బాల్‌తో జత కట్టాను. క్రికెట్‌తో పోలిస్తే తక్కువ సమయంలో పూర్తి కావడం, సిక్స్‌–ఎ–సైడ్‌లాంటి ఫార్మాట్‌ వల్ల తక్కువ మందితోనే ఆడే అవకాశం ఉండటం వల్ల ఇప్పుడు ఫుట్‌బాల్‌ వేగంగా జనాల్లోకి వెళుతోంది. ఇది మంచి పరిణామం. ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టేందుకు యూ త్‌కు ఫుట్‌బాల్‌ క్రీడ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది’ అని అఖిల్‌ అభిప్రాయపడ్డాడు. వరుసగా మూడో ఏడాది నిర్వహిస్తున్న హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌ విజయవంతం కావాలని అతను ఆకాంక్షించాడు. నగరంలోని 14 మైదానాల్లో హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌ నవంబర్‌ 25 నుంచి జనవరి 27 వరకు జరుగుతుంది. 12 జట్లు బరిలోకి దిగుతున్న ఈ సిక్స్‌–ఎ–సైడ్‌ టోర్నీలో మొత్తం 135 మ్యాచ్‌లు జరుగుతాయి. విజేతకు రూ.3 లక్షల ప్రైజ్‌మనీని అందజేస్తా రు. గత రెండు సీజన్లు తమ లీగ్‌కు మంచి ఆదరణ లభించిందని, అదే ఉత్సాహంతో ఈసారి మరింత బాగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని లీగ్‌ చైర్మన్‌ మురాద్‌ జసాని అన్నారు. మీడియా సమావేశంలో డైరెక్టర్లు ఆదిల్‌ మిస్త్రీ, నవీద్‌ కేశ్వాని తదితరులు పాల్గొన్నారు.  
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బాస్కెట్‌బాల్‌ చాంప్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌

వెస్టిండీస్‌కు భారీ షాక్!

వేన్‌ రూనీపై రెండేళ్ల డ్రైవింగ్‌ నిషేధం

శ్రీశాంత్‌ నిషేధంపై హైకోర్టులో బీసీసీఐ పిటిషన్‌

కోహ్లీకి మరో పెళ్లి ప్రపోజల్‌

ఔను.. అతన్ని కావాలనే టార్గెట్‌ చేశాం: పాండ్యా

హామిల్టన్‌ హ్యాట్రిక్‌

శ్రీలంక క్రికెటర్పై రెండేళ్ల నిషేధం

లెగ్‌ స్పిన్నర్లే కీలకం

‘బుచ్చిబాబు’ విజేత హైదరాబాద్‌

లిఫ్టర్‌ దీక్షితకు రూ. 15 లక్షల నజరానా

ఆయుష్, సుభాష్‌లకు స్వర్ణాలు

ఇంద్రజిత్‌ అజేయ సెంచరీ

అమెరికా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా హైదరాబాదీ

రైనాకు తప్పిన ప్రమాదం

హైదరాబాద్‌ జట్లకు టైటిల్స్‌

హైదరాబాద్‌ 329 ఆలౌట్‌

కబడ్డీ ఆటగాళ్ల గొడవ: తుపాకీతో కాల్పులు

టీ 20 మ్యాచ్: ఓ స్వీట్ రివేంజ్!

విరాట్‌ కోహ్లీ ఎవరు ?

ఇంకొక్కటే..

ఆటగాళ్లకు విశ్రాంతి కావాలి

ట్వీట్‌ వైరల్‌: కోహ్లీకి పాక్‌ అభిమానుల ప్రశంసలు

టాస్ 'అయోమయం'పై క్లారిటీ!

ఆర్చరీ ఉపాధ్యక్షులు శివకుమార్‌ కన్నుమూత

యూఎస్‌ ఓపెన్‌ 2017: ఫైనల్‌కు నాదల్‌

హరికృష్ణ నిష్క్రమణ

ఆరేళ్ల పాప లేఖపై సచిన్ స్పందన

సెమీస్‌లో ఏకలవ్య, గ్రీన్‌ ఓక్స్‌ జట్లు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'

నటి అమలాపాల్‌పై ఫిర్యాదు

కోలీవుడ్‌లో కేరాఫ్‌ కంచరపాలెం రీమేక్‌

ఆయన మూడో కన్ను తెరిపించాడు!

బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రేమలో పడలేదు..!

సూర్యకు ఆ హక్కు ఉంది..