రికార్డు సృష్టించిన ఇంగ్లాండ్‌ కెప్టెన్

20 Oct, 2016 10:25 IST|Sakshi
రికార్డు సృష్టించిన ఇంగ్లాండ్‌ కెప్టెన్

చిట్టగాంగ్‌: ఇంగ్లాండ్‌ టెస్టు జట్టు కెప్టెన్‌ అలిస్టర్‌ కుక్‌ మరో ఘనత సాధించాడు. ఇంగ్లాండ్‌ తరఫున అత్యధిక టెస్టులాడిన క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పనున్నాడు. బంగ్లాదేశ్ తో గురువారం ప్రారంభమైన తొలి టెస్టు మ్యాచులో బరిలోకి దిగి అతడు ఈ మైలురాయిని అందుకున్నాడు. 133 టెస్టులాడిన అలెక్‌ స్టివార్ట్‌ రికార్డును అతడు అధిగమించాడు. కుక్‌ 31 ఏళ్లకే ఈ రికార్డు సాధించడం విశేషం. ఇంగ్లాండ్‌ తరఫున టెస్టు క్రికెట్ లో 10 వేల పరుగులు చేసిన తొలి ఆటగాడు కూడా అతడే. 47.31 సగటుతో అతడు ఇప్పటివరకు 10,603 పరుగులు చేశాడు. ఇందులో 29 సెంచరీలు, 51 అర్ధసెంచరీలు ఉన్నాయి.

అత్యధిక వ్యక్తిగత స్కోరు 294. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అత్యధికంగా 200 టెస్టులు ఆడి అందరికంటే ముందున్నాడు. రికీ పాంటింగ్, స్టీవా(168) తర్వాతి స్థానంలో నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక టెస్టులు ఆడిన క్రికెటర్ల జాబితాలో కుక్ 11వ స్థానంలో ఉన్నాడు. కాగా, చిట్టగాంగ్ లో బంగ్లాదేశ్ తో జరుగుతున్న టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో కుక్ కేవలం 4 పరుగులు చేసి అవుటయ్యాడు.

మరిన్ని వార్తలు