అంత వీజీ కాదు!

15 Nov, 2016 00:18 IST|Sakshi
అంత వీజీ కాదు!

అన్ని విభాగాల్లో పటిష్టంగా ఇంగ్లండ్
ఇకపై భారత్ వ్యూహం మార్చాల్సిందే

ఐదే ఐదు రోజులు... భారత్ నేలకు దిగింది. బంగ్లాదేశ్ లాంటి జట్టు చేతిలోనే మూడు రోజుల్లో ఓడిపోరుున జట్టు మనకు కనీసం పోటీ ఇస్తుందా అనే భావన నుంచి... ఇకపై అప్రమత్తంగా లేకపోతే ఓడిపోవాలేమో అనే సందేహం వచ్చేసింది. తొలి టెస్టులో ఇంగ్లండ్ జట్టు అద్భుతంగా ఆడింది. ఒక రకంగా భారత జట్టు ఇన్నాళ్లూ సొంత గడ్డపై ప్రత్యర్థుల్ని ఎలా ఏడిపిస్తోందో.. ఈసారి ఇంగ్లండ్ మనల్ని అలా ఏడిపించేసింది. మొత్తానికి కష్టపడి తొలి టెస్టును ‘డ్రా’ చేసుకున్న భారత్ ఇకపై వ్యూహాన్ని పూర్తిగా మార్చాలి. అదే సమయంలో మరింత అప్రమత్తంగా ఆడాలి. ఎందుకంటే ఇంగ్లండ్‌పై గెలవడం అంత ఈజీ కాదని తొలి టెస్టుతో అర్థమైపోరుుంది. 

క్రీడావిభాగం కోహ్లి కెప్టెన్ అయ్యాక సొంతగడ్డపై టెస్టు మ్యాచ్‌ల్లో భారత్ ఒక్క టాస్ కూడా ఓడిపోలేదు. టాస్ గెలిచిన ప్రతిసారీ భారత్ బ్యాటింగ్ చేసింది. భారత్‌లో ఏ వేదికలో క్రికెట్ ఆడినా ఆఖరి రెండు రోజులు స్పిన్ ట్రాక్‌లు ఉంటారుు కాబట్టి... నాలుగో ఇన్నింగ్‌‌సలో ఆడాల్సిన ప్రమాదం తప్పేది. కానీ ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో సీన్ రివర్స్ అరుుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ఉంటే ఫలితం మరోలా ఉండేది. అరుుతే టాస్ అనేది ఎవరి చేతుల్లోనూ ఉండదు. కాబట్టి ప్రతికూల పరిస్థితుల్లో ఎలా అనే అంశంపై భారత్ దృష్టి పెట్టాలి. నిజానికి టాస్ కలిసి రావడం ఒక్కటే కాదు... ఇంగ్లండ్ అన్ని విభాగాల్లోనూ అద్భుతంగా ఆడింది.

అందరూ ఫామ్‌లో...
ఇంగ్లండ్ జట్టు ఈ సిరీస్ కోసం 19 ఏళ్ల కుర్రాడు హమీద్‌ను తీసుకొచ్చింది. తను స్పిన్ బాగా ఆడతాడనే కారణంతోనే చిన్న వయసులోనే అరంగేట్రం చేరుుంచారు. తనకు లభించిన అవకాశాన్ని ఆ కుర్రాడు అద్భుతంగా వినియోగించుకున్నాడు. రెండు ఇన్నింగ్‌‌సలోనూ ఆకట్టుకున్నాడు. ఇక కుక్ కూడా భారత్‌లో తనకు అలవాటైన ఆటతీరుతో అదరగొట్టాడు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్‌‌సలో ఆఖరి రోజు పిచ్‌పై సెంచరీని పూర్తి చేసుకున్నాడు. జో రూట్ మరోసారి తన విలువను నిరూపించుకుంటే... మొరుున్ అలీ ఉపఖండంలో సరిగా ఆడలేడనే అపప్రదను తొలగించుకున్నాడు. ఆల్‌రౌండర్ స్టోక్స్ బ్యాటింగ్ కూడా కొంత ఆశ్చర్యపరిచింది. ఓవరాల్‌గా ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ అందరూ మంచి ఫామ్‌లో కనిపిస్తున్నారు. ఎలాంటి పిచ్‌పై అరుునా అశ్విన్ బౌలింగ్‌ను ఆడటం అంత సులభం కాదు. కానీ ఈ మ్యాచ్‌లో అశ్విన్ బౌలింగ్‌లో అలవోకగా పరుగులు చేశారు. ఇంగ్లండ్ స్పిన్నర్లు కూడా ఆశించిన రీతిలో బౌలింగ్ చేశారు. ముఖ్యంగా ఆదిల్ రషీద్ బాగా ఆకట్టుకున్నాడు. అనుభవం లేకపోరుునా జఫర్ అన్సారీ... ఎంతో కొంత అనుభవం ఉన్న మొరుున్ అలీ కూడా బాగా బౌలింగ్ చేశారు. స్పిన్ బాగా ఆడతారనే పేరున్న భారత బ్యాట్స్‌మెన్‌నే ఈ స్పిన్ త్రయం వణికించింది.

మన కూర్పు సంగతేంటి?
నిజానికి తొలి టెస్టుకు తుది జట్టు ఎంపికలో భారత్ సరైన వ్యూహం అవలంభించలేదనే భావించాలి. ముగ్గురు స్పిన్నర్లు పనికొచ్చే పిచ్ మీద ఆడుతున్నప్పుడు పేసర్లకు పెద్దగా పని ఉండదు. అలాంటప్పుడు హార్దిక్ పాండ్యాను తుది జట్టులోకి తీసుకుని ఉంటే బ్యాటింగ్ విభాగం కూడా మరింత బలంగా కనిపించేది. ఆట పరంగా తొలి టెస్టులో భారత్‌కు కూడా కొన్ని సానుకూల అంశాలు ఉన్నారుు. విజయ్, పుజారా తొలి ఇన్నింగ్‌‌సలో అద్భుతంగా ఆడారు. రెండో ఇన్నింగ్‌‌సలో కోహ్లి ప్రతికూల పరిస్థితుల్లో తన శైలికి భిన్నంగా నాణ్యమైన టెస్టు ఆటతీరు కనబరిచాడు. రహానే రెండు ఇన్నింగ్‌‌సలోనూ విఫలమైనా... తను నైపుణ్యం ఉన్న క్రికెటర్ కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక అశ్విన్ బ్యాటింగ్ ఈ మ్యాచ్‌లో అత్యద్భుతం. ఆల్‌రౌండర్ అనే పదానికి తను అర్హుడని గతంలోనే నమ్మకం కుదిరినా... ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ ద్వారా తన స్థారుుని మరింత పెంచుకున్నాడు. ఓవరాల్‌గా ఆటతీరు పరంగా భారత్‌ను పెద్దగా ఇబ్బంది పెట్టే అంశాలు లేవు. అరుుతే రెండో ఇన్నింగ్‌‌సలో ప్రతికూల పరిస్థితుల్లో మనవాళ్లు పడ్డ తడబాటు ఇంగ్లండ్ జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందనడంలో సందేహం లేదు.

స్పిన్ పిచ్‌లే పరిష్కారమా?
నిజానికి భారత్‌లో టెస్టు అంటే నాలుగో రోజు ఉదయం సెషన్ నుంచే బంతి గిర్రున తిరగాలి. కానీ ఈసారి రాజ్‌కోట్‌లో బంతి కాస్త ఆలస్యంగా తిరగడం మొదలైంది. ఐదో రోజు ఆఖరి సెషన్‌లో బాగా ప్రభావం కనిపించింది. రాజ్‌కోట్‌లో జరిగిన తొలి టెస్టు కావడం వల్ల ఆ రాష్ట్ర సంఘం పెద్దగా రిస్క్ తీసుకుని ఉండకపోవచ్చు. అందుకే తొలి మూడు రోజులు పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలించేలా ట్రాక్‌ను రూపొందించారు. నిజానికి భారత బలం స్పిన్. కాబట్టి పూర్తిగా స్పిన్ ట్రాక్‌లు వేసి మూడో రోజు నుంచే బంతి తిరుగుతుంటే మనకు అనుకూలంగా ఫలితాలు రావచ్చు. కాబట్టి రాబోయే నాలుగు టెస్టులకు స్పిన్ ట్రాక్‌లు సిద్ధం చేయాలనే ఆదేశాలు ఇప్పటికే వెళ్లి ఉండొచ్చు. రెండో టెస్టు జరిగే వైజాగ్ ఇటీవల కాలంలో స్పిన్నర్లకు స్వర్గధామంలా మారింది. ముఖ్యంగా న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి వన్డే చూస్తే ఈ పిచ్‌పై స్పిన్నర్లు తప్ప మాట్లాడటానికి మరో అంశం ఉండదు. ఒకవేళ అదే తరహా పిచ్ వైజాగ్‌లో ఈ టెస్టుకు ఎదురైతే భారత్ అసలు బలమేంటో బయటకు వస్తుంది. ఒకవేళ అలాంటి వికెట్ ఎదురైనా ఇంగ్లండ్ గెలవడమో, డ్రా చేసుకోవడమో చేసిందంటే... భారత్ తీవ్రమైన ఒత్తిడిలోకి వెళ్లడం ఖాయం. ఏమైనా రెండో టెస్టుకు ముందు భారత్ మరింత కష్టపడాలి. అటు వ్యూహాల్లో, ఇటు ఆటతీరులోనూ మార్పులు చేసుకోవాలి. లేకపోతే... నాలుగేళ్ల క్రితం నాటి పరాభవాన్ని మళ్లీ చూడాల్సి వస్తుంది. 

ఇంగ్లండ్‌కు సౌలభ్యం...
జట్టు కూర్పు విషయంలో మనతో పోలిస్తే ఇంగ్లండ్‌కు మరింత సౌలభ్యత ఉంది. ముగ్గురు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉండటం... ఈ ఆరుగురిలో ఇద్దరు నిఖార్సైన ఆల్‌రౌండర్లు కావడం వల్ల జట్టు కూర్పు విషయంలో ఆ జట్టు భారత్‌తో పోలిస్తే మెరుగ్గా ఉంది. ఇక రెండో టెస్టుకు అండర్సన్ అందుబాటులోకి వస్తే ఆ జట్టు బౌలింగ్ మరింత బలపడుతుంది. వోక్స్ స్థానంలో అండర్సన్‌ను ఆడిస్తారు. అరుుతే కుక్‌ను బాగా ఆనందపరిచిన విషయం స్పిన్నర్ల ప్రదర్శన. ముఖ్యంగా భారత స్పిన్నర్లు బంతిని సరిగా స్పిన్ చేయలేకపోరుున పిచ్‌పై ఇంగ్లండ్ త్రయం ఆకట్టుకున్నారు. ఇది ఆ జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

మరిన్ని వార్తలు