తండ్రీకొడుకుల అర్ధ శతకాలు

13 Mar, 2017 22:34 IST|Sakshi
తండ్రీకొడుకుల అర్ధ శతకాలు

కింగ్‌స్టన్‌: క్రికెట్‌లో తండ్రీకొడుకులు ఇద్దరూ ఒకే మ్యాచ్‌లో అర్ధ శతకాలు బాది రికార్డు సృష్టించారు. మామూలుగా క్రికెట్‌లో అన్నదమ్ములు కలసి బ్యాటింగ్‌ చేస్తుంటేనే చూడ ముచ్చటగా ఉంటుంది. అలాంటిది తండ్రీ కొడుకులు ఒకే మ్యాచ్‌ ఆడుతూ అర్ధ శతకాలు బాదితే! అద్భుతంగా అనిపిస్తుంది. కరీబియన్‌ అభిమానులు ఈ అరుదైన ఇన్నింగ్స్‌ను చూసి ఆనందించారు. విండీస్‌ బ్యాటింగ్‌ దిగ్గజం శివ్‌నారాయణ్‌ చందర్‌పాల్‌ గుర్తున్నాడు కదా! ఆయన తన కుమారుడు త్యాగి నారాయణ్‌ చందర్‌పాల్‌తో కలసి ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ ఆడాడు.

సబీనా పార్క్‌లో నిర్వహిస్తున్న ప్రాంతీయ టోర్నీలో శివ్‌నారాయణ్, త్యాగినారాయణ్‌ గయానా తరఫున ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ ఆడారు. వీరిద్దరూ అర్ధశతకాలు సాధించడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 262 పరుగులు చేసింది. ప్రత్యర్థి జమైకా జట్టు 255 పరుగులు మాత్రమే చేయగలిగింది. త్యాగి (20) ఓపెనింగ్‌ రాగా తండ్రి శివ్‌నారాయణ్‌ (42) మూడో బ్యాట్స్‌మన్‌గా వచ్చాడు.

వీరిద్దరూ కలసి 12.2 ఓవర్లలో నాలుగో వికెట్‌కు 38 పరుగుల భాగస్వామ్యం జోడించారు. వీరిద్దరూ కలసి ఫస్ట్‌క్లాస్‌ యేతర మ్యాచ్‌లెన్నో ఆడి శతకాలు కూడా బాదారు. టెస్టు క్రికెట్‌లో 11,867 పరుగులు చేసిన శివ్‌నారాయణ్‌ విండీస్‌ రెండో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌. బ్రయాన్‌ లారా అతడికన్నా ముందున్నాడు.

మరిన్ని వార్తలు