-

యో-యో టెస్టుపై అంబటి రాయుడు స్పందన

25 Aug, 2018 11:27 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత జాతీయ క్రికెట్‌ జట్టుకు ఎంపికయ‍్యే ప్రతి ఒక్క క్రికెటర్‌కు ఫిట్‌నెస్‌ పరీక్ష ఉండాల్సిందేనని అంటున్నాడు అంబటి రాయుడు.  అయితే ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికైన తాను  యో-యో టెస్టులో ఉత్తీర్ణత సాధించకపోవడంతో నిరాశకు గురయ్యానని పేర్కొన్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో చెన్నై తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన అంబటి మెరుపులు మెరిపించాడు. శతకం, అర్ధశతకాలతో పరుగుల వరద పారించాడు. అతడి ప్రదర్శనకు మెచ్చిన బీసీసీఐ సెలక్టర్లు ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక చేశారు. చివరికి ‘యోయో’ పరీక్షలో విఫలమైన రాయుడు.. చక్కటి అవకాశాన్ని కోల్పోయాడు.

అంబటి రాయుడితో పాటు కేరళ కుర్రాడు సంజూ శాంసన్‌ సైతం యోయో ఫిట్‌నెస్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించకపోవడంతో మాజీ క్రికెటర్లు, అభిమానులు యోయోపై విమర్శలు గుప్పించారు. క్రికెట్‌కు ఫిట్‌నెస్‌ ఒక్కటే సరిపోదని, ప్రతిభ అవసరమని అన్నారు.  కాగా, అంబటి రాయుడు యోయో టెస్టుపై స్పందిస్తూ.. ‘యోయోలో విఫలమైనందుకు నిరాశ కలిగింది. ఫిట్‌నెస్‌ పరీక్ష కచ్చితమన్న నిబంధనకు నేనేమీ వ్యతిరేకం కాదు. భారత జట్టులోని ప్రతి క్రికెటర్‌కు కచ్చితంగా ఒక ఫిట్‌నెస్‌ స్థాయి ఉండాల్సిందే. నిజం చెప్పాలంటే నేను దాన్ని నమ్ముతున్నా.  యోయోలో విజయవంతం కాలేదని బాధపడ్డా. ఆ తర్వాత కష్టపడి సాధించా. క్రికెట్‌కు ఫిట్‌నెస్‌ కచ్చితంగా అవసరమే. ప్రతి ఒక్కరూ దాన్ని అనుసరించాల్సిందే. ఒక కచ్చితమైన బెంచ్‌మార్క్‌ ఉన్నందుకు సంతోష పడుతున్నా’ అని అంబటి అన్నాడు.

 చదవండి: భారత్‌ ‘ఎ’ను గెలిపించిన రాయుడు 

మరిన్ని వార్తలు