అమెరికా కోచ్‌గా వెంకటపతిరాజు

28 Aug, 2015 00:10 IST|Sakshi
అమెరికా కోచ్‌గా వెంకటపతిరాజు

దుబాయ్ : భారత మాజీ క్రికెటర్, హైదరాబాద్‌కు చెందిన ఎస్. వెంకటపతిరాజుకు అరుదైన అవకాశం దక్కింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పర్యవేక్షణలోని అమెరికా క్రికెట్ జట్టు కోచ్‌లలో ఒకడిగా అతను వ్యవహరిస్తాడు. ‘ఐసీసీ అమెరికాస్ క్రికెట్ కంబైన్’ అనే పేరుతో వ్యవహరిస్తున్న ఈ జట్టుకు శిక్షణ ఇచ్చేందుకు ఐసీసీ కోచ్‌ల బృందాన్ని ఎంపిక చేసింది. రాజుతో పాటు బౌలింగ్ దిగ్గజం కోట్నీ వాల్ష్ కూడా ఇందులో ఉన్నారు.

క్రికెటర్‌గా రిటైర్ అయిన తర్వాత రాజు... భారత జట్టు సెలక్టర్‌గా, హైదరాబాద్ రంజీ జట్టు కోచ్‌గా పని చేయడంతో పాటు హెచ్‌సీఏ ఉపాధ్యక్షుడిగా కూడా వ్యవహరించాడు. ఇటీవలి వరకు ఐసీసీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఆసియా రీజియన్ అభివృద్ధి అధికారిగా కూడా పని చేశాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు