చెన్నై టెస్టు; జయంత్‌, భువి అవుట్‌

16 Dec, 2016 10:48 IST|Sakshi
చెన్నై టెస్టు; జయంత్‌, భువి అవుట్‌

చెన్నై: ఇంగ్లండ్‌తో చివరి, ఐదో టెస్టుకు టీమిండియాలో రెండు కీలక మార్పులు చేశారు. గాయపడ్డ జయంత్‌ యాదవ్‌కు విశ్రాంతి ఇచ్చి, అతని స్థానంలో అమిత్‌ మిశ‍్రాను తుది జట్టులోకి తీసుకున్నారు. అలాగే యువ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ స్థానంలో సీనియర్‌ ఇషాంత్‌ శర్మను తీసుకున్నారు. ఈ రెండు మార్పులు మినహా నాలుగో టెస్టులో ఆడిన భారత ఆటగాళ్లే ఐదో మ్యాచ్‌లో బరిలోకి దిగారు.  

చెన్నైలో శుక్రవారం ఆరంభమైన ఐదో టెస్టులో ఇంగ్లండ్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. విరాట్‌ కోహ్లీ సేన ఇప్పటికే ఈ సిరీస్‌ను 3-0 తేడాతో గెల్చుకున్న సంగతి తెలిసిందే. చెన్నై టెస్టులోనూ విజయం సాధించి, సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేయాలనే పట్టుదలతో ఉంది.

మరిన్ని వార్తలు