చరిత్ర పునరావృతం కాదు.. పాక్‌ కప్‌ కొట్టలేదు 

2 Jul, 2019 08:55 IST|Sakshi

న్యూఢిల్లీ: సోషల్‌మీడియాలో చురుగ్గా ఉంటూ ఆసక్తికర ట్వీట్లతో ఆకట్టుకునే కార్పోరేట్ దిగ్గజం, మహింద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహింద్రా ప్రపంచకప్-2019 పరిణామాలపై స్పందించారు. ఆదివారం ఇంగ్లండ్ చేతిలో భారత జట్టు ఓటమి అనంతరం పాకిస్తాన్‌ జట్టును ఉద్దేశిస్తూ ఆసక్తికర ట్వీట్‌ చేశారు. ఇంగ్లండ్‌తో చెస్‌ తరహాలో టీమిండియా ఎత్తులకు పైఎత్తులు వేసి పాక్‌ను సెమీస్‌ రేసు నుంచి ఔట్‌ చేసిందన్నారు.1992 ప్రపంచకప్ నాటి పరిస్థితులే పాక్‌కు పునరావృతం అవుతున్నాయన్న వార్తలను కొట్టిపడేశారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని మ్యాచ్‌లు అప్పటిని గుర్తు చేస్తున్నాయన్న వాదనలో పసలేదని, చరిత్ర ఎప్పటికి పునరావృతం కాదని తేల్చి పడేశారు. పాకిస్తాన్‌కు కప్‌ కొట్టె సీన్‌ లేదన్నారు. అయితే పాక్‌ కథ అప్పుడే ముగియలేదు.  న్యూజిలాండ్‌ చేతిలో ఇంగ్లండ్‌ ఓడిపోయి... బంగ్లాదేశ్‌పై గెలిస్తే పాకిస్తాన్‌ 11 పాయింట్లతో సెమీస్‌ బెర్త్‌ దక్కించుకుంటుంది. దీంతో సర్ఫరాజ్‌ సేన న్యూజిలాండ్‌పై ఆశలు పెట్టుకుంది. (చదవండి: తప్పులు సరిచేసుకుంటారా?)

>
మరిన్ని వార్తలు