అనయ, అక్షయలకు పతకాలు

9 Apr, 2019 15:23 IST|Sakshi

జాతీయ స్కూల్స్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌  

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ స్కూల్స్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులు రాణించారు. రాయ్‌పూర్‌లో జరిగిన ఈ టోర్నీలో 6 పతకాలను సాధించారు. ఇందులో 4 రజతాలు, 2 కాంస్యాలు ఉన్నాయి. అండర్‌–7 బాలికల విభాగంలో నిర్ణీత 9 రౌండ్లకుగాను 7.5 పాయింట్లు సాధించిన అక్షయ (కింగ్స్‌ చెస్‌ అకాడమీ) రజతాన్ని గెలుచుకోగా... అత్తాపూర్‌కు చెందిన అనయ (మేస్ట్రో చెస్‌ అకాడమీ) 7 పాయింట్లతో కాంస్య పతకాన్ని సాధించింది. నగరానికే చెందిన మరో చిన్నారి హారిక 6 పాయింట్లతో ఎనిమిదో స్థానానికి పరిమితమైంది. అండర్‌–9 బాలుర కేటగిరీలో కింగ్స్‌ అకాడమీకి చెందిన సుహాస్‌ రెండోస్థానాన్ని దక్కించుకున్నాడు.

అండర్‌–11 బాలికల కేటగిరీలో జి. శ్రీశాంతి, బాలుర విభాగంలో షేక్‌ సుమేర్‌ అర్‌‡్ష (రేస్‌ చెస్‌ అకాడమీ) 7.5 పాయింట్లతో రజత పతకాలను సాధించారు. ఎస్‌. నాగలక్ష్మి 6.5 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. అండర్‌–13       విభాగంలో సరయు 7 పాయింట్లతో కాంస్యాన్ని గెలుచుకోగా... సేవిత విజు, మైత్రి, కీర్తి వరుసగా ఆరు, ఏడు, ఎనిమిది స్థానాలను సంపాదించారు. బాలుర విభాగంలో జేఎస్‌ఎస్‌ శ్రీకర్‌ ఆరోస్థానంలో నిలిచాడు. అండర్‌–15 బాలుర   కేటగిరీలో సృజన్‌ నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాడు. అండర్‌–17 విభాగంలో కె. శరత్‌చంద్ర కుమార్‌ 6 పాయింట్లు స్కోర్‌ చేసి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు.   

మరిన్ని వార్తలు