జడేజాపై దురుసుగా ప్రవర్తించా: ఆండర్సన్

3 Aug, 2014 13:12 IST|Sakshi

లండన్: భారత్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, ఇంగ్లండ్ పేసర్ ఆండర్సన్ల మధ్య ఏర్పడ్డ వివాదానికి తెరపడింది. ఈ సంఘటనపై విచారించిన ఐసీసీ ఇద్దరికీ క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే తొలి టెస్టు సందర్భంగా జడేజాను తాను దూషించినట్టు ఆండర్సన్ అంగీకరించాడు. జడేజాను నెట్టేసి, పళ్లు రాలకొడతానంటూ తిట్టానని చెప్పాడు.

ఈ వివాదంలో జడేజాపై మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత... ఇక ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్‌పై రెండు టెస్టుల వేటు ఖాయమని క్రికెట్ ప్రపంచం తొలుత ఊహించింది. అయితే జ్యుడీషియల్ కమిషనర్ గార్డన్ లూయిస్ విచారణాంతరం ఇద్దరూ నిర్దోషులే అని తేల్చారు. ఈ విషయాన్ని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. జడేజా, అండర్సన్ క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘించలేదని కమిషనర్ పేర్కొన్నట్టు స్పష్టం చేసింది. దీంతో జడేజాపై విధించిన మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత కూడా ఉపసంహరించుకున్నట్టయ్యింది.

మరిన్ని వార్తలు