భారత్కు గట్టి పోటీనిస్తాం: కుక్

6 Nov, 2016 00:20 IST|Sakshi
భారత్కు గట్టి పోటీనిస్తాం: కుక్

ముంబై: ప్రపంచ నంబర్‌వన్ భారత క్రికెట్ జట్టుతో జరిగే ఐదు టెస్టుల సిరీస్‌లో తమను అండర్‌డాగ్స్ గా పరిగణించినా ఎలాంటి ఇబ్బంది లేదని ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ అలిస్టర్ కుక్ స్పష్టం చేశాడు. నిజానికి తమను అలా భావిస్తే ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసుకున్న ఇంగ్లండ్ ఈనెల 9 నుంచి రాజ్‌కోట్‌లో ప్రారంభమయ్యే తొలి టెస్టు ద్వారా భారత పర్యటనను ఆరంభించనుంది.

2012లో కుక్ బృందం 2-1తో నెగ్గిన అనంతరం భారత జట్టు స్వదేశంలో టెస్టు సిరీస్ ఓడిపోరుుంది లేదు. ‘నంబర్ వన్ జట్టుతో ఆడడం ఎప్పుడూ సవాల్‌తో కూడుకున్నదే. అదీకాకుండా వారి సొంత గడ్డపై ఆడటమంటే మాకు కఠిన పరీక్షగానే భావించాలి. అలాగే మా జట్టులో చాలామందికి ఇక్కడ ఆడిన అనుభవం లేదు. అరుునా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ జట్టుకు గట్టి పోటీనిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. పెద్ద జట్లతో మేం కూడా మంచి సిరీస్‌లే ఆడాం.

గతేడాది నంబర్‌వన్‌గా ఉన్న దక్షిణాఫ్రికాపై సిరీస్ నెగ్గాం. భారత్ నుంచి ఎదురయ్యే సవాల్‌ను స్వీకరించేందుకు మా ఆటగాళ్లంతా సిద్ధంగా ఉన్నారు’ అని ఉపఖండంలో 60కి పైగా సగటు కలిగిన కుక్ ధీమా వ్యక్తం చేశాడు. నాలుగేళ్ల క్రితం గ్రేమ్ స్వాన్, మోంటీ పనేసర్‌లతో కూడిన స్పిన్ విభాగం పటిష్టంగా ఉందని, ప్రస్తుతం తాము అలాంటి స్థితిలో లేమని అంగీకరించాడు. ఆరుగురు బౌలర్లతో బరిలోకి దిగేందుకు అనువైన పరిస్థితులు జట్టులో ఉన్నట్టు తెలిపాడు.             

‘అండర్సన్ రాక మాకు సానుకూలం’
గాయంతో బాధపడుతున్న పేసర్ జేమ్స్ అండర్సన్ మంగళవారం జట్టుతో చేరనున్నట్టు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తెలిపింది. అరుుతే ఫిట్‌నెస్‌ను నిరూపించుకున్నప్పటికీ తొలి టెస్టుకు అందుబాటులో ఉండడని కెప్టెన్ కుక్ తెలిపాడు. అండర్సన్ రాక జట్టు బలాన్ని పెంచుతుందని, విశాఖలో జరిగే రెండో టెస్టుకు తను ఆడే అవకాశాలున్నట్టు చెప్పాడు.

మరిన్ని వార్తలు