క్వార్టర్స్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ జట్లు

14 Dec, 2019 09:54 IST|Sakshi

జాతీయ సెపక్‌తక్రా చాంపియన్‌షిప్‌  

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ జూనియర్‌ సెపక్‌తక్రా చాంపియన్‌షిప్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ జట్లు నిలకడగా రాణిస్తున్నాయి. చాదర్‌ఘాట్‌లోని విక్టరీ ప్లేగ్రౌండ్‌ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీ రెగు ఈవెంట్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ బాలుర జట్లు క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకున్నాయి. శుక్రవారం జరిగిన రెగు ఈవెంట్‌ తొలి లీగ్‌ మ్యాచ్‌లో తెలంగాణ 21–16, 21–8తో గోవాపై, రెండో లీగ్‌ మ్యాచ్‌లో 21–8, 21–8తో పాండిచ్చేరిపై, మూడో లీగ్‌ మ్యాచ్‌లో 22–20, 21–17తో ఉత్తరాఖండ్‌పై గెలుపొంది క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది.

ఆంధ్రప్రదేశ్‌ జట్టు తమ తొలి లీగ్‌ మ్యాచ్‌లో 21–10, 21–11తో గుజరాత్‌పై, రెండో లీగ్‌ మ్యాచ్‌లో 21–13, 21–17తో మధ్యప్రదేశ్‌పై విజయాలు నమోదు చేసింది. బాలికల విభాగంలో తెలంగాణ జట్టు విఫలమైంది. తొలి మ్యాచ్‌లో తెలంగాణ 21–17, 13–21, 18–21తో ఒడిశా చేతిలో, రెండో మ్యాచ్‌లో 8–21, 21–17, 15–21తో రాజస్తాన్‌ చేతిలో ఓటమి చవిచూసింది. ఆంధ్రప్రదేశ్‌ జట్టు 21–9, 21–13తో తమిళనాడుపై నెగ్గింది.  

ఇతర మ్యాచ్‌ల ఫలితాలు

బాలురు: ఢిల్లీ 21–6, 21–6తో పాండిచ్చేరిపై, బిహార్‌ 21–11, 21–8తో జార్ఖండ్‌పై, హరియాణా 21–11, 21–18తో హిమాచల్‌ ప్రదేశ్‌పై, మహారాష్ట్ర 21–4, 21–8తో జమ్ము కశ్మీర్‌పై, కర్ణాటక 21–12, 21–19తో రాజస్తాన్‌పై, ఉత్తరాఖండ్‌ 21–14, 21–6తో పంజాబ్‌పై, ఒడిశా 21–13, 21–9తో చండీగఢ్‌పై, మణిపూర్‌ 21–7, 21–10తో అస్సాంపై, కేరళ 21–14, 21–11తో తమిళనాడుపై, ఢిల్లీ 21–8, 21–9తో బెంగాల్‌పై, బిహార్‌ 21–18, 21–15తో నాగాలాండ్‌పై, కర్ణాటక 21–13, 21–10తో హిమాచల్‌ప్రదేశ్‌పై, మహారాష్ట్ర 21–8, 21–6తో జార్ఖండ్‌పై, అస్సాం 21–16, 12–21, 21–19తో రాజస్తాన్‌పై గెలుపొందాయి.  

బాలికలు: అస్సాం 21–11, 18–21, 21–7తో హరియాణాపై, నాగాలాండ్‌ 21–11, 21–4తో జార్ఖండ్‌పై, గోవా 21–10, 21–19తో కేరళపై, బిహార్‌ 21–10, 21–15తో బెంగాల్‌పై, ఉత్తర్‌ప్రదేశ్‌ 21–9, 21–11తో తమిళనాడుపై, ఢిల్లీ 21–12, 21–10తో గుజరాత్‌పై, అస్సాం 21–4, 21–11తో బెంగాల్‌పై, నాగాలాండ్‌ 21–7, 21–6తో తమిళనాడుపై, హరియాణా 21–17, 21–8తో బిహార్‌పై, ఉత్తర్‌ప్రదేశ్‌ 21–7, 21–4తో జార్ఖండ్‌పై, కేరళ 21–15, 21–16తో కర్ణాటకపై, అస్సాం 21–15, 21–17తో మహారాష్ట్రపై, ఒడిశా 21–4, 21–2తో గుజరాత్‌పై, రాజస్తాన్‌ 21–15, 21–12తో ఢిల్లీపై, మణిపూర్‌ 21–5, 21–7తో కర్ణాటకపై, హరియాణా 21–14, 21–11తో మహారాష్ట్రపై నెగ్గాయి. 

మరిన్ని వార్తలు