వేణును ఆడించాల్సిందే...

15 Sep, 2016 00:44 IST|Sakshi
వేణును ఆడించాల్సిందే...

సాక్షి నెట్‌వర్క్: ఆంధ్ర క్రికెట్ సంఘం వేణుగోపాలరావు లాంటి సీనియర్ క్రికెటర్ సేవలను వినియోగించుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. కూలింగ్ ఆఫ్ పీరియడ్ అనే నిబంధన సాకుతో వేణును ఏసీఏ పక్కనపెట్టడంపై సాక్షిలో వచ్చిన కథనంపై పలువురు స్పందించారు.
 
 రూల్ కరెక్ట్ కాదు
 ‘లక్షలకు లక్షలు ఖర్చు చేసి ఇతర రాష్ట్రాల నుంచి క్రికెటర్లను తెచ్చి ఆడిస్తున్నారు. రాజకీయాల్లో ఉన్న కైఫ్‌ను తెచ్చి ఆడించారు. స్థానిక ఆటగాడు వేణును ఆడించకపోవడం అన్యాయం. సంవత్సరం పాటు ఎక్కడా ఆడకూడదు అంటూ వేణుకు నిబంధన పెట్టడం ఎంత వరకు సమంజసమో ఏసీఏ పెద్దలు ఆలోచించాలి. కూలింగ్ ఆఫ్ పీరియడ్ అనే రూల్ కరెక్ట్ కాదు. భారత దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఆంధ్ర క్రికెటర్‌ను అవమానించడం కరెక్ట్ కాదు.’      
 - మధుసూదన్ రాజు, ఆంధ్ర సెలక్షన్ కమిటీ మాజీ సభ్యుడు
 
అవసరమైతే నిబంధనలు మార్చాలి
  ‘వేణు మంచి క్రికెటర్. ఉత్తరాంధ్ర నుంచి దేశానికి ఆడిన ఏకైక ఆటగాడు. కొత్త కొత్త నిబంధనలు సాకుగా చూపించి ఆంధ్ర జట్టులోకి తీసుకోకపోవడం విచారకరం. అవసరమైతే నిబంధనలు మార్చాలి. ఈ విషయంపై నేను ఏసీఏ కార్యదర్శి గంగరాజుతో మాట్లాడతాను’.
 - విష్ణుకుమార్ రాజు, ఉత్తర విశాఖపట్నం ఎమ్మెల్యే
 
ఐదు నిమిషాలు చాలు...
 ‘వేణు క్రమశిక్షణ కలిగిన క్రికెటర్. అలాంటి ఆటగాడిని ఆడించకపోవడం అన్యాయం. బయటి వాళ్ల చుట్టూ తిరిగే బదులు అనుభవం ఉన్న ఆంధ్ర ఆటగాడిని ఆడించాలి. కూలింగ్ ఆఫ్ పీరియడ్ బీసీసీఐ రూల్ కాదు. ఈసీ మీటింగ్ పెట్టి ఐదు నిమిషాల్లో నిబంధన మార్చవచ్చు. ఆటగాడు తన కెరీర్ కోసం ఎక్కడైనా ఆడొచ్చు.     -వెంకట్రావు, ఏసీఏ మాజీ ప్రధాన కార్యదర్శి
 

మరిన్ని వార్తలు