కూతురు పుట్టబోతోంది: క్రికెటర్‌

18 Sep, 2019 11:34 IST|Sakshi

వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌ మొదటిసారి తండ్రి కాబోతున్నాడు. అతడి భార్య జేసిమ్‌ లోరా త్వరలోనే పండంటి పాపాయికి జన్మనివ్వబోతున్నట్లు తెలిపాడు. తాము తల్లిదండ్రులు కాబోతున్న విషయాన్ని క్యూట్‌ వీడియో ద్వారా రసెల్‌ ఇన్‌స్టాలో అభిమానులతో పంచుకున్నాడు. బేబీ రసెల్‌ పేరిట ఏర్పాటు చేసిన పార్టీలో..రసెల్‌ భార్య బౌలింగ్‌ చేయగా.. ఆ బాల్‌ను బ్యాట్‌తో పగులగొట్టిన రసెల్‌..తనకు కూతురు పుట్టబోతున్నట్లు సింబాలిక్‌గా చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన రసెల్‌...‘ నా జీవితంలోకి మరో ఆనందం రాబోతోంది. అమ్మాయి పుట్టబోతోంది. కూతురైనా, కొడుకైనా నాకు ఒక్కటే. పుట్టేది ఎవరైనా సరే వారు పూర్తి ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నా’ అని క్యాప్షన్‌ జతచేశాడు.

ఈ క్రమంలో రసెల్‌- జేసిమ్‌ లోరా దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ‘కంగ్రాట్స్‌ బ్రదర్‌. మరో అదృష్టవంతురాలైన అమ్మాయి. మరి నాకు ఆహ్వానం పంపలేదే’ అంటూ సిక్సర్ల వీరుడు క్రిస్‌ గేల్‌ అభినందనలు తెలుపుతూనే అలకబూనాడు. ఇక మరో విండీస్‌ ఆటగాడు బ్రెత్‌వైట్‌..తల్లీబిడ్డా క్షేమంగా ఉండాలని..ప్రసవం సాఫీగా జరగాలని ఆకాంక్షించాడు. ఇతర సహచర ఆటగాళ్లు సైతం రసెల్‌ను శుభాకాంక్షలతో ముంచెత్తారు. కాగా మోకాలి గాయంతో ప్రపంచ కప్‌ నుంచి నిష్క్రమించిన రసెల్‌... భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు కూడా దూరమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(సీపీఎల్‌)లో భాగంగా మైదానంలో దిగిన ఈ విండీస్‌ ఆల్‌రౌండర్‌ బంతిని బలంగా బాదేందుకు ప్రయత్నించి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ క్రమంలో అతడికి ప్రాథమిక చికిత్స చేసిన మెడికల్‌ విభాగం..ఆస్పత్రికి తరలించింది. అనేక పరీక్షల అనంతరం రసెల్‌కు ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తేల్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.  

So it's #GIRL😁😁😁 another blessing in my life it didn't matter if it was a girl or a boy, all am asking God for is a healthy baby #babyrussell @partyblasterspro

A post shared by Andre Russell (@ar12russell) on

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా