మూడేళ్ల తర్వాత వన్డే జట్టులోకి..

17 Jul, 2018 16:19 IST|Sakshi

ఆంటిగ్వా: వెస్టిండీస్‌ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ ఆండ్రీ రస్సెల్‌ మూడేళ్ల తర్వాత వన్డే జట్టులో పునరాగమనం చేయబోతున్నాడు. ఈ మేరకు బంగ్లాదేశ్‌ జరుగనున్న వన్డే సిరీస్‌కు ప‍్రకటించిన 13 మంది సభ్యుల జట్టులో రస్సెల్‌ చోటు దక్కించుకున్నాడు. 2015లో శ్రీలంకతో చివరిసారి విండీస్‌ జట్టులో కనిపించిన రస్సెల్‌.. డోపింగ్‌ నిబంధనల్ని అతిక‍్రమించాడు. దాంతో యాంటీ డోపింగ్ ఏజెన్సీ క్రమశిక్షణా ఉల్లంఘన చర్యలు తీసుకోవడంతో విండీస్‌ జట్టుకు రస్సెల్‌ దూరం కావాల్సి వచ‍్చింది. తాజాగా అతనికి మరొకసారి జట్టులో చోటు కల్పిస్తూ విండీస్‌ బోర్డు నిర్ణయం తీసుకుంది.

‘వచ్చే ఏడాది వరల్డ్‌ కప్‌ జరుగనున్న నేపథ్యంలో రస్సెల్‌కు చోటు కల్సిస్తూ సెలక్టర్లు తీసుకున్న నిర్ణయం అభినందనీయం. అతనొక అసాధారణ ఆటగాడు. రస్సెల్‌ ఎంతటి ప్రమాదకర ఆటగాడో ప్రపంచానికి తెలుసు. రస్సెల్‌ వంటి ఆల్‌ రౌండర్‌ జట్టులోకి రావడంతో మా బలం రెట్టింపు అయ్యింది’ అని రస్సెల్‌ పునరాగమనంపై విండీస్‌ ప్రధాన కోచ్‌ స్టువర్ట్‌ లా ఆనందం వ్యక్తం చేశాడు.

2018 ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో రస్సెల్‌ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో 316 పరుగులు చేయడంతో పాటు 13 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు.

మరిన్ని వార్తలు