'ఇంత చెత్త ఫ్రాంచైజీని నేనెప్పుడు చూడలేదు'

30 Apr, 2020 11:50 IST|Sakshi

జమైకా : వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌ కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ప్రాంచైజీపై అసహనం వ్యక్తం చేశాడు. రసెల్‌ కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో  జమైకా తలవాస్‌‌కు ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కు  జమైకా తలవాస్‌ లాంటి విచిత్ర జ‌ట్టును మ‌రొకటి చూడలేదంటూ రసెల్‌ పేర్కొన్నాడు. కాగా రెండు రోజుల క్రిత‌మే ఇదే ఫ్రాంచైజీకి సహాయ కోచ్‌గా ఉన్న మాజీ విండీస్‌ ఆటగాడు రామ్‌నరేశ్‌ శర్వాణ్‌పై విండీస్ విధ్వంస‌క వీరుడు క్రిస్ గేల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. శర్వాణ్‌ కరోనా మహమ్మారి కంటే చెత్త అని గేల్‌ విరుచుకుపడ్డాడు. ఈ సీజన్‌లో ఫ్రాంచైజీ తనను రీటెయిన్‌ చేసుకోకుండా వదిలించుకోవడానికి శర్వాణే కారణమని గేల్‌ ఆరోపించాడు. తాజాగా రసెల్‌  జమైకా తలవాస్‌‌పై తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు.(శర్వాణ్‌... నీవు కరోనా వైరస్‌ కంటే డేంజర్)

'నేను ప్రాతినిథ్యం వహించిన అన్ని జట్లలోకెల్లా  జమైకా తలవాస్‌ విచిత్ర‌మైన‌ది. ఇది నిజంగా ఒక చెత్త ఫ్రాంచైజీ.. ఇలాంటి ఫ్రాంచైజీని నేనెప్పుడు చూడలేదు. ఇది నేను ఊరికే చేస్తున్న ఆరోప‌ణ కాదు. ఆ జ‌ట్టుతో క‌లిసి సుధీర్ఘంగా కొనసాగుతున్నా. అంతే కాదు ఒక‌ప్పుడు లీడ‌ర్ టీమ్‌లో మెంబ‌ర్‌గానూ ఉన్నా. వారి ఆలోచ‌నా ధోర‌ణిని ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించా. ఆ జ‌ట్టు త‌ర‌ఫున ఆడ‌టం కంటే ఊరుకోవ‌డం ఉత్త‌మం. ఇప్పటికైనా యాజ‌మాన్య తీరు మార‌క‌పోతే ఆ జ‌ట్టు మ‌నుగ‌డ క‌ష్ట‌మేనంటూ' ర‌సెల్ పేర్కొన్నాడు.  
('రసెల్‌తో ఆడితే అదే ఫీలింగ్‌ కలుగుతుంది')

(షోయబ్‌ అక్తర్‌పై ‘పీసీబీ’ పరువు నష్టం కేసు)

మరిన్ని వార్తలు