ముర్రే... ఈసారైనా!

8 Jul, 2013 06:32 IST|Sakshi
ముర్రే... ఈసారైనా!

 ఆండీ ముర్రే... ఈరోజు యావత్ బ్రిటన్ ఈ ఒక్క వ్యక్తిపైనే దృష్టి సారిస్తుందంటే అతిశయోక్తి కాదేమో! అతను ఒక్క విజయం సాధిస్తే 77 ఏళ్ల బ్రిటన్ అభిమానుల నిరీక్షణకు తెరపడుతుంది. గత ఏడాది ఫెడరర్ చేతిలో తుదిమెట్టుపై బోల్తా పడిన ఈ ప్రపంచ రెండో ర్యాంకర్ ఈసారి మళ్లీ అంతిమ సమరానికి సిద్ధమయ్యాడు. ఆదివారం జరిగే వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)తో ముర్రే అమీతుమీ తేల్చుకుంటాడు.
 
 భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 2 గంటల తర్వాత ముగిసిన రెండో సెమీఫైనల్లో ఆండీ ముర్రే 6-7 (2/7), 6-4, 6-4, 6-3తో జెర్గీ జానోవిచ్ (పోలండ్)పై విజయం సాధించాడు. ఫైనల్లో ఒకవేళ ముర్రే గెలిస్తే... 1936లో ఫ్రెడ్ పెర్రీ తర్వాత వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను నెగ్గిన తొలి బ్రిటన్ ప్లేయర్‌గా గుర్తింపు పొందుతాడు. ముఖాముఖి పోరులో జొకోవిచ్ 11-7తో ముర్రేపై ఆధిక్యంలో ఉన్నాడు.
 

మరిన్ని వార్తలు