విండీస్‌ పర్యటనకు కుంబ్లేనే...

13 Jun, 2017 00:50 IST|Sakshi
విండీస్‌ పర్యటనకు కుంబ్లేనే...

ముంబై: భారత క్రికెట్‌ జట్టు కోచ్‌గా అనిల్‌ కుంబ్లే మరో సిరీస్‌కు కూడా కొనసాగనున్నారు. ‘విండీస్‌తో జరిగే సిరీస్‌ వరకు కూడా కుంబ్లే కోచ్‌గా ఉంటారు. అయితే అది ఆయన అంగీకారం మీద ఆధారపడి ఉంటుంది’ అని పరిపాలకుల కమిటీ (సీఓఏ) చీఫ్‌ వినోద్‌ రాయ్‌ వెల్లడించారు. మరోవైపు కాన్‌ఫ్లిక్ట్‌ ఆఫ్‌ ఇంట్రస్ట్‌ సమస్యలు పరిష్కరించేందుకు బీసీసీఐ త్వరలోనే కొత్తగా ఎథిక్స్‌ ఆఫీసర్‌ను నియమించనుంది. ఈ అంశంపై చాలా ఫిర్యాదులు వచ్చాయని, ఎథిక్స్‌ ఆఫీసర్‌ వీటిపై దృష్టి పెడతారని రాయ్‌ చెప్పారు.

26న ఎస్‌జీఎం: బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం) ఈ నెల 26న జరగనుంది. ఇందులో కొత్త కోచ్‌ ఎంపిక అంశం చర్చించడం లేదని బోర్డు స్పష్టం చేసింది. ప్రధానంగా లోధా కమిటీ సిఫారసుల అమలుపైనే ఇందులో చర్చ జరగనుంది. దీంతో పాటు ఇటీవల జరిగిన ఐసీసీ సమావేశాలు, వాటి పరిణామాలు, రాబోయే సిరీస్‌లు, పాకిస్తాన్‌తో ఇటీవల దుబాయ్‌లో జరిగిన సమావేశం తదితర ఏడు అంశాలతో బీసీసీఐ అజెండా సిద్ధమైంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫుట్‌బాల్‌కు ఆదరణ పెరుగుతోంది

జట్టుకు కోహ్లి.. విజయాలకు ధోని!

బాస్కెట్‌బాల్‌ చాంప్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌

వెస్టిండీస్‌కు భారీ షాక్!

వేన్‌ రూనీపై రెండేళ్ల డ్రైవింగ్‌ నిషేధం

సినిమా

భార్య, పిల్లలు విదేశాల్లో చిక్కుకుపోయారు: విష్ణు

ఈ పాటను చేతులు కడుక్కొని వినండి!

ఇంటి ప‌ని చేస్తూ ఏడ్చేసిన‌ న‌టి

‘దారుణం, అత‌డి ప్ర‌తిభ‌ను కొట్టేశారు’

న‌యా ట్రెండ్ సృష్టిస్తోన్న ‘ఆహా’

సింగ‌ర్‌కు ఐదోసారీ క‌రోనా పాజిటివ్‌