అంకుర్‌ ‘పసిడి’ గురి

6 Aug, 2017 03:50 IST|Sakshi
అంకుర్‌ ‘పసిడి’ గురి

న్యూఢిల్లీ: ఆసియా షాట్‌గన్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్‌ అంకుర్‌ మిట్టల్‌ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. కజకిస్తాన్‌లోని అస్తానాలో జరుగుతున్న ఈ టోర్నీలో శనివారం జరిగిన పురుషుల డబుల్‌ ట్రాప్‌ ఈవెంట్‌లో అంకుర్‌ వ్యక్తిగత విభాగంతోపాటు, టీమ్‌ విభాగంలోనూ భారత్‌కు పసిడి పతకాన్ని అందించాడు.

ఆరుగురు పాల్గొన్న వ్యక్తిగత విభాగం ఫైనల్లో అంకుర్‌ 71 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచాడు. ఖాలిద్‌ అల్కాబి (యూఏఈ–70 పాయింట్లు) రజతం, సైఫ్‌ అల్‌షమ్సీ (యూఏఈ–53 పాయింట్లు) కాంస్యం సాధించారు. అంకుర్, సంగ్రామ్‌ దహియా, మొహమ్మద్‌ అసబ్‌లతో కూడిన భారత బృందానికి స్వర్ణం దక్కింది. ఈ ఏడాది మెక్సికో, న్యూఢిల్లీలలో జరిగిన ప్రపంచకప్‌లలో అంకుర్‌ స్వర్ణ, రజత పతకాలు గెలిచాడు.
 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫుట్‌బాల్‌కు ఆదరణ పెరుగుతోంది

వేన్‌ రూనీపై రెండేళ్ల డ్రైవింగ్‌ నిషేధం

శ్రీశాంత్‌ నిషేధంపై హైకోర్టులో బీసీసీఐ పిటిషన్‌

లిఫ్టర్‌ దీక్షితకు రూ. 15 లక్షల నజరానా

అమెరికా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా హైదరాబాదీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రణయ్‌ హత్యపై స్పందించిన చరణ్

బాలీవుడ్‌కు విజయ్‌ దేవరకొండ..!

ట్వీట్‌ ఎఫెక్ట్‌ : చిక్కుల్లో స్టార్‌ సినిమాటోగ్రాఫర్‌

ఫొటోలు దిగి మురిసిపోయిన సన్నీ లియోన్‌

మరో రికార్డ్‌ ‘ఫిదా’

నిరసన సెగ : లవ్‌యాత్రిగా మారిన సల్మాన్‌ టైటిల్‌