విజేత ఉషెనినా 

29 Jun, 2020 00:29 IST|Sakshi

చెన్నై: అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (ఫిడే) ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళల స్పీడ్‌ చెస్‌ ఆన్‌లైన్‌ చాంపియన్‌షిప్‌ తొలి అంచె టోర్నీలో ఉక్రెయిన్‌ గ్రాండ్‌మాస్టర్‌ అనా ఉషెనినా విజేతగా నిలిచింది. వాలెంటినా గునీనా (రష్యా)తో ఆదివారం జరిగిన ఫైనల్లో ఉషెనినా 7–4తో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఉషెనినాకు 12 గ్రాండ్‌ప్రి పాయింట్లతోపాటు 3 వేల డాలర్ల (రూ. 2 లక్షల 26 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. ఈ టోర్నీలో భారత్‌ తరఫున హంపి, వైశాలి బరిలోకి దిగారు. 

మరిన్ని వార్తలు