అండర్సన్ లేకుండా...

26 Oct, 2016 23:23 IST|Sakshi

భారత్‌తో టెస్టు సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టు ప్రకటన 


లండన్: భారత్‌తో జరిగే ఐదు టెస్టుల సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టును ప్రకటించారు. కుక్ సారథ్యంలో ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఆడుతున్న 16 మంది సభ్యుల బృందాన్ని భారత్‌తో సిరీస్‌కూ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం గాయంతో ఉన్న ఇంగ్లండ్ స్టార్ పేస్ బౌలర్ అండర్సన్ తొలి టెస్టుకు అందుబాటులో ఉండటం లేదని ఇప్పటికే ప్రకటించారు. అరుుతే తను తొలి మూడు టెస్టులూ ఆడకపోవచ్చని, డిసెంబరులో అందుబాటులో ఉంటాడని సమాచారం. నవంబరు 9న భారత్, ఇంగ్లండ్‌ల తొలి టెస్టు రాజ్‌కోట్‌లో జరుగుతుంది. ఆ తర్వాత వరుసగా విశాఖపట్నం, మొహాలీ, ముంబై, చెన్నైల్లో టెస్టులు జరుగుతారుు.

ఇంగ్లండ్ జట్టు: కుక్ (కెప్టెన్), మొరుున్ అలీ, జఫర్ అన్సారీ, బెరుుర్ స్టో, జేక్ బాల్, గ్యారీ బ్యాలన్‌‌స, గ్యారెత్ బ్యాటీ, స్టువర్ట్ బ్రాడ్, బట్లర్, డకెట్, స్టీవ్ ఫిన్, హసీబ్, ఆదిల్ రషీద్, రూట్, స్టోక్స్, వోక్స్.

 

మరిన్ని వార్తలు