మరో భారత రెజ్లర్ అనర్హత

7 May, 2016 00:54 IST|Sakshi

న్యూఢిల్లీ: ఒలింపిక్ క్వాలిఫికేషన్ ఈవెంట్ నుంచి మరో భారత రెజ్లర్ అనర్హతకు గురయ్యాడు.  రియో ఒలింపిక్స్‌కు చివరి అర్హత పోటీలైన రెండో ప్రపంచ క్వాలిఫయింగ్ టోర్నీలో గుర్‌ప్రీత్ సింగ్ గ్రీకో రోమన్ 75కేజీ విభాగంలో పాల్గొనాల్సి ఉంది. అయితే తను ఉండాల్సిన దానికన్నా 500 గ్రాముల బరువు అధికంగా తూగాడు. దీంతో తనను బరిలోంచి తప్పించారు. గత నెల ఇదే కారణంగా వినేశ్ ఫోగట్ తప్పుకోవాల్సి వచ్చింది.

రెజ్లర్ల నిరాశాప్రదర్శన
ఇస్తాంబుల్: ఒలింపిక్  క్వాలిఫయింగ్ టోర్నీలో భారత్‌కు చెందిన నలుగురు రెజ్లర్లు తమ ప్రత్యర్థుల చేతిలో పరాజయం పాలయ్యారు. 85కేజీ విభాగంలో రవీందర్, 130 కేజీలో నవీన్ , రవీందర్ సింగ్ (59కేజీ), సురేశ్ యాదవ్ (66కేజీ)  ఏమాత్రం ప్రభావం చూపలేదు.

మరిన్ని వార్తలు