గోపీచంద్‌ అకాడమీలో మరో శిక్షణ కేంద్రం 

5 Feb, 2019 01:47 IST|Sakshi

అత్యున్నత ప్రమాణాలతో నిర్మాణం

కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ సహకారం

సాక్షి, హైదరాబాద్‌: భారత బ్యాడ్మింటన్‌కు కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌లో క్రీడాకారుల కోసం మరో శిక్షణ కేంద్రం ఏర్పాటు కానుంది. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్‌ అకాడమీ ఆవరణలో అదనంగా ఆరు ఎయిర్‌ కండిషన్డ్‌ కోర్టుల నిర్మాణం జరగనుంది. ఈ మేరకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన శిక్షణ కేంద్రం నిర్మాణం కోసం కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ లిమిటెడ్‌ ముందుకొచ్చింది. పుల్లెల గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ ఫౌండేషన్‌తో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా రాబోయే మూడేళ్ల కాలంలో రూ.

30 కోట్ల నుంచి రూ. 35 కోట్లు వెచ్చించి ఈ శిక్షణ కేంద్రాన్ని అభివృద్ధి చేస్తామని సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ దీపక్‌ గుప్తా తెలిపారు. ఈ కేంద్రంలో స్పోర్ట్స్‌ సైన్స్‌ సెంటర్‌ను కూడా నెలకొల్పుతామని, కోచ్‌లకు శిక్షణ కా ర్యక్రమాలు ఉంటాయని అన్నారు. ‘అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణ సౌకర్యాలు లభిస్తే భారత ఆటగాళ్లు మున్ముందు మరిన్ని గొప్ప ఫలితాలు సాధిస్తారు. అంతర్జాతీయ మ్యాచ్‌లను ఎయిర్‌ కండిషన్డ్‌ కోర్టులలో నిర్వహిస్తారు. అకాడమీలో ఎయిర్‌ కండిషన్డ్‌ కోర్టులు ఉండాలని కోరుకున్నాం. త్వరలోనే వీటి నిర్మాణ పనులు  మొదలవుతాయి. ఇందులో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు ప్రాక్టీస్‌ చేస్తారు’ అని జాతీయ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ తెలిపారు.   

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా