నెటిజన్లపై అనుష్క ధ్వజం

24 Jun, 2016 00:53 IST|Sakshi
నెటిజన్లపై అనుష్క ధ్వజం

వారంతా శక్తిహీనులు

ముంబై: టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి గర్ల్ ఫ్రెండ్, నటి అనుష్క శర్మ నెటిజన్లపై విమర్శలు ఎక్కుపెట్టింది. గతంలో కోహ్లి ఫామ్ కోల్పోవడానికి తనే కారణమని సోషల్ సైట్లలో తీవ్రస్థాయిలో వచ్చిన విమర్శలపై తొలిసారి స్పందించింది. ‘వారంతా స్త్రీ ద్వేషులు. సొంత ఆదాయంతో విజయవంతంగా బాధ్యతలు నిర్వర్తించే మహిళలను చూస్తే వారి ఇగో దెబ్బతింటుంది.  నాకు ఎలాంటి సంబంధం లేని విషయంపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఎలా?’ అని అనుష్క ప్రశ్నించింది.

మరిన్ని వార్తలు