కోహ్లి కౌగిలిలో అనుష్క.. ఫోటోలు వైరల్‌!

25 Nov, 2019 11:34 IST|Sakshi

ముంబై: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్‌తో తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.  చారిత్రక టెస్టులో భారత్‌ సత్తా చాటడంతో ఘన విజయాన్ని అందుకుంది. దాంతో సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. మూడు రోజుల్లోనే పింక్‌ బాల్‌ టెస్టు ముగియడంతో భారత జట్టు సభ్యులు సోమవారం ముంబైకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే ముంబై ఎయిర్‌ పోర్ట్‌లో దిగిన టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి భార్య అనుష్క శర్మ ఘనంగా స్వాగతం పలికారు. కోహ్లి రాకకోసం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిన అనుష్క భర్తను స్వయంగా రిసీవ్‌ చేసుకున్నారు.

భర్త కోహ్లిని చూసిన వెంటనే అనుష్క ఆనందంలో మునిగిపోయారు. వీరు ఇంటికి చేరుకునే క‍్రమంలో కారులో బయల్దేరగా, కోహ్లి ఒడిలో అనుష్క వాలిపోయారు. భర్తను గట్టిగా హగ్‌ చేసుకుని బహిరంగంగానే ప్రేమను వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వీరు ఎప్పుడు ఖాళీ దొరికినా తీరక లేకుండా బిజీ బిజీగా గడుపుతారు. తమ షెడ్యూల్‌ను బట్టి ట్రిప్‌లు ప్లాన్‌లు చేసుకుంటూ ఉంటారు. ఇటీవల భూటాన్‌లో విహరించిన ఈ జంట.. వాటికి సంబంధించి ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పెడుతూ అభిమానుల్ని ఆకట్టుకున్నారు. తాజాగా కోహ్లి-అనుష్కలు ఇంటికి చేరుకునే క్రమంలో బహిరంగంగా ప్రేమను  ఇలా వ్యక్తం చేయడం ఫ్యాన్స్‌లో మంచి జోష్‌ను తీసుకొచ్చాయి.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నా ఫేవరెట్‌ ఐపీఎల్‌ టీమ్‌ సీఎస్‌కే: మూడీ

‘నేను కెప్టెన్‌ ఎందుకు కాకూడదు’

నిధుల సేకరణకు దిగ్గజ క్రికెటర్లు

షాట్‌ కొట్టి.. పరుగు కోసం ఏం చేశాడో తెలుసా!

కోహ్లిని వద్దన్న ధోని..!

సినిమా

దండంబెట్టి చెబుతున్నా.. దండతో గోడెక్కకు

ఇది బిగ్గెస్ట్ ఫ్యాన్ మూమెంట్: త‌మ‌న్

కరోనా: క‌నికాకు బిగ్‌ రిలీఫ్‌

అందరూ ఒక్కటై వెలుగులు నింపండి: చిరు, నాగ్‌

కరోనా క్రైసిస్‌: శివాని, శివాత్మిక ఉదారత

ప్రధాని పిలుపుపై రామ్‌ చరణ్‌ ట్వీట్‌