కోహ్లి కష్టానికి ఫలితం ఇంతేనా?

30 Apr, 2018 13:48 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: 'ఈ సాలా కప్ నమ్‌దే' (ఈ ఏడాది కప్ మనదే) ఆశలకు గండిపడుతున్న వేళ.. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు వరుస ఓటములు ఆ జట్టు అభిమానులను నిరాశకు గురి చేస్తున్నాయి. ఆదివారం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సైతం ఓడి.. పాయింట్ల పట్టికలో దిగువ నుంచి రెండో స్థానంలో ఆర్సీబీ నిలిచింది. అయితే మ్యాచ్‌లో అర్థ సెంచరీతో రాణించిన కోహ్లి.. చివర్లో పట్టిన ఓ స్టన్నింగ్‌ క్యాచ్‌ ఆకట్టుకుంది. ఓటమి అంచుల్లో కూడా అభిమానులు ఆ క్షణాన్ని ఎంజాయ్‌ చేశారు. కోహ్లి సూపర్‌ మ్యాన్‌లా డైవ్‌ చేసి మరీ పట్టిన ఆ క్యాచ్‌కు కోహ్లి సతీమణి ఇచ్చిన హవభావాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వాటిని పోస్టు చేస్తూ... ‘భయ్యా అంత కష్టపడి క్యాచ్‌ పడితే.. నువ్వు ఇచ్చే ప్రతిఫలం ఇంతేనా వదినా?’ అంటూ ఓ వ్యక్తి ట్వీట్‌ చేయగా.. ‘ఆ ఎక్స్‌ప్రెషన్‌ను ఏమని అర్థం చేసుకోవాలంటూ’ మరో వ్యక్తి ట్వీట్‌ చేశాడు. ‘అనుష్క ఇచ్చిన వావ్‌ ఎక్స్‌ప్రెషన్‌ బాగుందంటూ’ ఇంకో వ్యక్తి ట్వీట్‌ చేశాడు. ఇదిలా ఉంటే కోహ్లి రాణిస్తున్నప్పటికీ.. బౌలింగ్‌. ఫీల్డింగ్‌​ విభాగాల్లో విఫలం అవుతుండటంతో జట్టు పరాజయం పాలవుతోంది. ఈ విషయంపై కోహ్లి మీడియా ముందే అసంతృప్తి వ్యక్తం చేశాడు కూడా.

మరిన్ని వార్తలు