'మార్చి 8 కోసం ఎదురుచూస్తున్నా'

5 Mar, 2020 19:35 IST|Sakshi

న్యూఢిల్లీ : ఐసీసీ మహిళల టీ-20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్, భారత్ మధ్య జరగాల్సిన సెమీఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. దీంతో గ్రూప్‌లో ప్రథమ స్థానంలో ఉన్న భారత్.. నిబంధనల ప్రకారం ఫైనల్స్‌కు చేరింది. అయితే దీనిపై కొందరు నెటిజన్లతో పాటు పలువురు మాజీ ఆటగాళ్లు ఐసీసీ నిబంధనలను తప్పుబడుతూ విమర్శల కురిపించారు. కానీ, టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ టీమిండియా ఫైనల్‌ వెళ్లిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ  ట్వీట్‌‌ చేశారు.(ఇంగ్లండ్‌ను చూస్తే బాధేస్తోంది)

'వర్షం కారణంగా మనం చూడాల్సిన ఇక అద్భుతమైన మ్యాచ్ రద్దైంది. మన అమ్మాయిలు ఫైనల్స్‌కి వెళ్లారు. ఏదేమైనా, దీన్ని మంచిగా భావిద్దాము. మార్చి 8న మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నా. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున టీమిండియా కప్పు గెలవాలని కోరుకుంటున్నా'అంటూ ట్వీట్ చేసింది. అనుష్క చేసిన ట్వీట్‌పై అన్ని వర్గాల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. కాగా అనుష్కతో పాటు విరాట్ కోహ్లి కూడా భారత అమ్మాయిలను అభినందిస్తూ ట్వీట్ చేశాడు. ' టీ-20 ప్రపంచకప్ ఫైనల్స్‌కు చేరిన భారత మహిళ జట్టుకు అభినందనలు. అమ్మాయిలు మిమ్మల్ని చూస్తే చాలా గర్వంగా ఉంది' అంటూ విరాట్ పేర్కొన్నాడు. కాగా మార్చి 8న జరగబోయే ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియాతో తలపడనుంది. అయితే గ్రూఫ్‌ దశలో  ఆసీస్‌పై గెలిచి ఆత్మవిశ్వాసంతో ఉన్న భారత మహిళల జట్టు ఫైనల్లోనూ అదే ప్రదర్శనను పుననావృతం చేయాలని భావిస్తుంది. (టీమిండియా కాచుకో.. ఆసీస్‌ వచ్చేసింది)

మరిన్ని వార్తలు