బెంబేలెత్తించిన అన్వర్ అహ్మద్

7 Aug, 2014 00:05 IST|Sakshi

ఈఎంసీసీ 174 ఆలౌట్
 ఎ1-డివిజన్ మూడు రోజుల లీగ్
 
 సాక్షి, హైదరాబాద్: అన్వర్ అహ్మద్ ఖాన్ (5/53) ధాటికి ఈఎంసీసీ 174 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఎ1-డివిజన్ మూడు రోజుల లీగ్‌లో హైదరాబాద్ బాట్లింగ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 39 పరుగుల ఆధిక్యం సాధించింది.
 
 బుధవారం 118/7 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన ఈఎంసీసీ తొలి ఇన్నింగ్స్‌లో మరో 56 పరుగులు జోడించి ఆలౌటైంది. బాట్లింగ్ బౌలర్లలో అన్వర్‌తో పాటు అనిరుధ్ (3/63) రాణించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బాట్లింగ్ తొలి ఇన్నింగ్స్‌ను 213/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. అచింత్య రావు (65) అర్ధసెంచరీ సాధించగా, రవీందర్ రెడ్డి 32 పరుగులు చేశాడు. కృష్ణచరిత్ 3, రవితేజ 2 వికెట్లు తీశారు.
 
 ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
 దక్షిణ మధ్య రైల్వే తొలి ఇన్నింగ్స్: 249 (సురేశ్ 79, ఫరీద్ 58; హరీశ్ 4/46), కేంబ్రిడ్జ్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 59/2
 
 ఆర్. దయానంద్ తొలి ఇన్నింగ్స్: 298 (విజయ్ 63, శశాంక్ నాగ్ 46; పరంవీర్ 3/35), డెక్కన్ క్రానికల్ తొలి ఇన్నింగ్స్: 187/2 (సందీప్ 94 బ్యాటింగ్, పార్థ్‌జాల 73 బ్యాటింగ్)
 ఎన్స్‌కాన్స్ తొలి ఇన్నింగ్స్: 432 (రేయాన్ అమూరి 152, ఇబ్రహీం 89; రామకృష్ణ 3/88), ఎంపీ కోల్ట్స్ తొలి ఇన్నింగ్స్: 105/2 (మహంతి 63 బ్యాటింగ్).
 
 షిండే అజేయ సెంచరీ
 అమోల్ షిండే (159 బ్యాటింగ్) అజేయ సెంచరీతో ఆంధ్రాబ్యాంక్ తొలి ఇన్నింగ్స్‌లో 112 పరుగుల ఆధిక్యం సంపాదించింది. మొదట ఫలక్‌నుమా తొలి ఇన్నింగ్స్‌లో 258 పరుగుల వద్ద ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్రాబ్యాంక్ ఆట ముగిసే సమయానికి 9 వికెట్లు కోల్పోయి 370 పరుగులు చేసింది. రోడ్రిగ్వెజ్ (51) రాణించగా, ఫలక్‌నుమా బౌలర్లలో సాకేత్ 4, అహ్మద్ అస్కరి 3 వికెట్లు తీశారు.
 
 చెలరేగిన భండారి
 ఆకాశ్ భండారి ఆల్‌రౌండ్ మెరుపులతో ఎస్‌బీహెచ్ ఇన్నింగ్స్ 33 పరుగుల తేడాతో కాంటినెంటల్‌పై ఘనవిజయం సాధించింది. ఎస్‌బీహెచ్ తొలి ఇన్నింగ్స్‌లో 345 పరుగుల వద్ద ఆలౌటైంది. భండారి (131) సెంచరీతో కదం తొక్కాడు. దీంతో 163 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్ ఆడిన కాంటినెంటల్ 130 పరుగులకే ఆలౌటైంది. బౌలింగ్‌లోనూ చెలరేగిన భండారి 5 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో కాంటినెంటల్ 182 పరుగులే చేసింది.
 

>
మరిన్ని వార్తలు