ఏపీఎఫ్‌ఏ అధ్యక్షుడిగా అలీ రఫత్

7 Oct, 2013 00:14 IST|Sakshi

ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: పదేళ్ల అనంతరం ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ (ఏపీఎఫ్‌ఏ)కు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఐఏఎస్ అధికారి డాక్టర్ మహ్మద్ అలీ రఫత్, ప్రధాన కార్యదర్శిగా జి.పి.ఫల్గుణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా ఎన్నికైన అలీ రఫత్ ప్రస్తుతం రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

 ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్ మలిరెడ్డి, జె.వెంకటేశ్వరరావు, ఎన్.పి.వెంకటేష్, సహాయ కార్యదర్శిగా వై.శశికాంత్ భూషణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంయుక్త కార్యదర్శులుగా పి.రఘనాథ్ రెడ్డి, బహీర్ అహ్మద్‌లకు చెరో 31 ఓట్లు లభించగా, జగన్నాథరావు 30 ఓట్లతో ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి రిటైర్డ్ జస్టిస్ టి.సి.హెచ్. సూర్యారావు ప్రకటించారు.
 
  ఎన్నికైన వారు నాలుగేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. కోర్టు ఆదేశాల ప్రకారం జరిగిన ఈ ఎన్నికలు ఎల్బీ స్టేడియంలోని ఒలింపిక్ భవన్‌లో ఆదివారం జరిగాయి. పర్యవేక్షకులుగా రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్(ఏపీఓఏ) ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ కె.రంగారావు, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ(శాప్) డిప్యూటీ డెరైక్టర్ సి.హెచ్.రమేష్, ఆలిండియా ఫుట్‌బాల్ సమాఖ్య(ఏఐఎఫ్‌ఎఫ్) అసిస్టెంట్ సెక్రటరీ కర్నల్ మెహతా, గులాబ్ రబ్బానీలు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు