‘స్మిత్‌.. నిన్ను ఔట్‌ చేయడానికే ఇక్కడ లేను’

29 Aug, 2019 15:28 IST|Sakshi

మాంచెస్టర్‌: ‘నన్ను ఔట్‌ చేయడంలో చాలా మంది ఇంగ్లిష్‌ బౌలర్లు సక్సెస్‌ అయ్యారు... కానీ ఆర్చర్‌ కాదు. నేను గాయపడ్డ టెస్టులో కూడా నేనేమీ ఆర్చర్‌కు వికెట్‌ ఇవ్వలేదు కదా’ అని ఆసీస్‌ క్రికెటర్‌ స్టీవ్‌ స్మిత్‌ స్పందించగా, అందుకు ఇంగ్లండ్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌ తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చాడు. ‘నువ్వు అసలు మూడో టెస్టులో ఆడనప్పుడు నేను ఎలా ఔట్‌ చేస్తా.  ఆ టెస్టులో నేను తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీశా. నేనేమీ ఏ ఒక్కరినో ఔట్‌ చేయడానికి ఇక్కడ లేను.  నీ వికెట్‌ తీయడానికి మాత్రమే క్రికెట్‌ ఆడటం లేదు. యాషెస్‌ సిరీస్‌ గెలవాలన్నదే మా కోరిక.

అందులో నీ వికెట్‌ ఉందా.. లేదా అనేది కాదు. నేను యాషెస్‌ సిరీస్‌ను గెలవాలనుకుంటున్నా. నిన్న ఔట్‌ చేయడానికి నా ముందు చాలా సమయం ఉంది ’ అని ఆర్చర్‌ చాలెంజ్‌ విసిరాడు. సాధారణంగా ఆసీస్‌ క్రికెటర్లు మ్యాచ్‌కు ముందు ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టడంలో సిద్ధహస్తులు. అటువంటిది ఇటీవల అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఆర్చర్‌ తన బౌలింగ్‌ రుచిని చూపిండమే కాదు... మాటల వేడి కూడా ఇలానే ఉంటుందంటూ ఆసీస్‌కు హెచ్చరికలు పంపాడు.

యాషెస్‌ సిరీస్‌ రెండో టెస్టులో ఆసీస్‌ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఆర్చర్‌ వేసిన అత్యంత వేగవంతమైన బౌన్సర్‌ను తప్పించుకునే క‍్రమంలో స్మిత్‌ గాయపడ్డాడు. బంతి మెడకు తగలడంతో స్మిత్‌ అక్కడికక్కడే కూలబడిపోయాడు. అయితే తనకు గాయమైన మరుక్షణం ఫిలిప్ హ్యూస్ విషాదం కళ్లముందు కదలాడిందని స్మిత్‌ తాజాగా చెప్పుకొచ్చాడు.   అయితే తనకు ఆర్చరే ప్రధాన ప్రత్యర్థి అని పలువురి విశ్లేషించిన నేపథ్యంలో స్మిత్‌ స్పందిస్తూ.. నాకు ఆర్చర్‌ ఒక్కడే టార్గెట్‌ కాదు.  నన్ను ఔట్‌ చేయడంలో చాలా మంది ఇంగ్లిష్‌ బౌలర్లు సక్సెస్‌ అయ్యారు. ఆర్చర్‌కు నేనేమీ చిక్కలేదు’ కదా పేర్కొన్నాడు. దీనిపై ఆర్చర్‌ కౌంటర్‌ ఎటాక్‌కు దిగాడు.

మరిన్ని వార్తలు