బౌలింగ్‌, బ్యాటింగ్‌లో చెలరేగిన ఆర్చర్‌

8 Aug, 2019 14:28 IST|Sakshi

వుడ్‌మెన్‌ కోట్‌: ఇంగ్లండ్‌ ఆల్‌ రౌండర్‌ జోఫ్రా ఆర్చర్‌ అటు బౌలింగ్‌ ఇటు బ్యాటింగ్‌లోనూ చెలరేగిపోయాడు. ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న సెకండ్‌ ఎలెవన్‌ చాంపియన్‌షిప్‌ సౌత్‌ గ్రూప్‌లో ససెక్స్‌ షైర్‌ తరఫున ఆడుతున్న ఆర్చర్‌ ఆరు వికెట్లతో సత్తాచాటగా, ఆపై బ్యాటింగ్‌లో సెంచరీతో మెరిశాడు. మంగళవారం గ్లౌసెష్టర్‌షైర్‌తో ప్రారంభమైన మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఆర్చర్‌ ఆరు వికెట్లను నేలకూల్చాడు. అతని ధాటికి గ్లౌసెష్టర్‌ బ్యాట్స్‌మెన్‌ విలవిల్లాడిపోయారు. దాంతో తన తొలి ఇన్నింగ్స్‌లో గ్లౌసెష్టర్‌ షైర్‌ 79 పరుగులకే చాపచుట్టేసింది. అటు తర్వాత బ్యాటింగ్‌లో ఆరో స్థానంలో వచ్చిన ఆర్చర్‌ 99 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 108 పరుగులు సాధించాడు. గ్లౌసెష్టర్‌ బౌలర్లకు పరీక్షగా నిలుస్తూ సెంచరీతో కదం తొక్కాడు. దాంతో ససెక్స్‌ షైర్‌ తొలి ఇన్నింగ్స్‌లో 322 పరుగులు చేసింది.  తన రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన గ్లౌసెష్టర్‌ 199 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది. ఈ ఐదు వికెట్లలో ఆర్చర్‌ వికెట్‌ సాధించాడు.

దాంతో యాషెస్‌ సిరీస్‌ రెండో టెస్టులో ఆర్చర్‌ ఆడటం దాదాపు ఖాయమనట్లే కనబడుతోంది. యాషెస్‌కు ఎంపిక చేసిన జట్టులో ఆర్చర్‌ను తీసుకున్నా తొలి టెస్టులో ఆడే అవకాశం రాలేదు. జేమ్స్‌ అండర్సన్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌లు ఉండటంతో ఆర్చర్‌కు చోటు దక్కలేదు. అండర్సన్‌ రెండో టెస్టుకు గాయం కారణంగా అందుబాటులో లేకపోవడంతో ఆర్చర్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంది. వన్డే వరల్డ్‌కప్‌లో 20 వికెట్లు సాధించి ఇంగ్లండ్‌ టైటిల్‌ సాధించడంలో ఆర్చర్‌ కీలక పాత్ర పోషించాడు. ఆ మెగా టోర్నీలో ఇంగ్లండ్‌ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచాడు. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఒక్క క్లిక్‌తో క్రీడా వార్తలు

అక్తర్‌ ఫిక్సింగ్‌ చేయమన్నాడు!

టీ20 క్రికెట్‌ చరిత్రలో నయా రికార్డు

శ్రీలంక ప్రధాన కోచ్‌పై సస్పెన్షన్‌ వేటు

‘మెక్‌గ్రాత్‌ను గుర్తుకు తెస్తున్నాడు’

‘టెక్నికల్‌గా సరైన బ్యాట్స్‌మన్‌ కాదు’

ప్రిక్వార్టర్స్‌లో అశ్విని–సిక్కి రెడ్డి జంట

అన్సారీకి స్వర్ణ పతకం

శ్రీథన్‌కు కాంస్యం

కోచ్‌ మికీ ఆర్థర్‌కు పాక్‌ గుడ్‌బై

హరియాణా స్టీలర్స్‌ గెలుపు

భారత క్రికెట్‌ను దేవుడే రక్షించాలి

భారత స్టార్స్‌కు చుక్కెదురు

మా డబ్బులిస్తేనే ఆడతాం!

బోపన్న జంట సంచలనం

సింధు సంపాదన రూ.39 కోట్లు

నిఖత్‌ జరీన్‌కు షాక్‌!

ఇక వన్డే సమరం

బలిపశువును చేశారు.. పాక్‌ కోచ్‌ ఆవేదన

ఎవరు సాధిస్తారు.. కోహ్లినా? గేలా?

ఇంగ్లండ్‌కు దెబ్బ మీద దెబ్బ

‘సాహోరే చహర్‌ బ్రదర్స్‌’

‘ప్రధాన కోచ్‌ను కొనసాగించే ముచ్చటే లేదు ’

నేటి క్రీడా విశేషాలు

ధోని రికార్డును బ్రేక్‌ చేసిన పంత్‌

ఏకైక భారత మహిళా అథ్లెట్‌గా.. సింధు!

ఇదో ఫ్యాషన్‌ అయిపోయింది; గంగూలీ ఫైర్‌!

లదాఖ్‌ క్రికెటర్లు కశ్మీర్‌ తరఫున...

ద్రవిడ్‌కు అంబుడ్స్‌మన్‌ నోటీస్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తమిళ అర్జున్‌ రెడ్డి రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

అందుకే నన్ను అరెస్టు చేశారు: హీరోయిన్‌

‘ఇండియన్‌ 2’ ఇప్పట్లో రాదట!

బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఔదార్యం

ఆకట్టుకుంటున్న ‘రాహు’ ఫస్ట్ లుక్

నా తప్పులు నేను తెలుసుకున్నా: నాగ్‌