ఆర్చరీ కోచ్‌ జీవన్‌జ్యోత్‌ రాజీనామా 

22 Sep, 2018 01:08 IST|Sakshi

చండీగఢ్‌: ఉత్తమ కోచ్‌లకు ఇచ్చే జాతీయ క్రీడా పురస్కారం ‘ద్రోణాచార్య’ జాబితా నుంచి తనను తొలగించినందుకు నిరసనగా భారత ఆర్చరీ కాంపౌండ్‌ విభాగం జట్టు కోచ్‌ జీవన్‌జ్యోత్‌ సింగ్‌ తేజ తన పదవికి రాజీనామా చేశారు. అవార్డుల సెలెక్షన్‌ కమిటీ తొలుత జీవన్‌జ్యోత్‌ పేరును నామినీల జాబితాలో చేర్చినా... 2015లో ప్రపంచ యూనివర్సిటీ క్రీడల సందర్భంగా క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడిన ఉదంతాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర క్రీడా శాఖ అతని పేరును తొలగించింది.
 

‘భారత ఆర్చరీ జట్టు కోచ్‌ పదవికి నేను రాజీనామా చేశాను. 2015లో నాపై భారత ఆర్చరీ సంఘం విధించిన ఏడాది కాలం నిషేధాన్ని పూర్తి చేసుకున్నాను. నాటి ఉదంతంలో నా పాత్ర లేదని విచారణలోనూ తేలింది’ అని జీవన్‌ జ్యోత్‌ తెలిపారు. ఇటీవల ముగిసిన జకార్తా ఆసియా క్రీడల్లో కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలో రజత పతకాలు గెలిచిన భారత పురుషుల, మహిళల జట్లకు జీవన్‌జ్యోత్‌ కోచ్‌గా ఉన్నారు. 

మరిన్ని వార్తలు