పాత కోచ్... పాత విల్లు

13 Aug, 2014 01:52 IST|Sakshi
పాత కోచ్... పాత విల్లు

- ఫామ్‌లోకి వచ్చిన ఆర్చర్ దీపిక
- ప్రపంచకప్‌లో మూడు పతకాలు
- ఆసియా క్రీడలపై దృష్టి

న్యూఢిల్లీ: రెండేళ్లు... సాధారణంగా ఏ క్రీడాకారుడికైనా ఇది అమూల్యమైన సమయం. 18 ఏళ్లకే ప్రపంచ ఆర్చరీలో నంబర్‌వన్ (2012లో)గా నిలిచిన భారత ఆర్చర్ దీపికా కువూరికైతే ఇది అత్యంత విలువైన సవుయుం. పేలవ ప్రదర్శన కారణంగా ఈ రెండేళ్లలో దీపిక సాధించింది అంతంత వూత్రమే. ఫలితంగా టాప్-10లో స్థానం కూడా కోల్పోరుుంది. కానీ... ఇటీవల వుుగిసిన ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్-4 టోర్నీలో దీపిక మునుపటి ప్రదర్శనను కొనసాగిస్తూ ఒక బంగారు పతకంతో పాటు రెండు కాంస్యాలు సాధించింది. ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’ అనే నానుడిని నిజం చేస్తూ పాత విల్లుతో ఈ టోర్నీలో బరిలోకి దిగడమే కాకుండా పూర్వపు కోచ్ ధర్మేందర్ తివారి ఆధ్వర్యంలో వుంచి ఫలితాలు సాధించింది. ‘ప్రపంచకప్ ముందు వరకు నేను పేలవ ప్రదర్శనను కొనసాగించా.

2012లో ప్రపంచ నంబర్‌వన్‌గా ఉన్న నేను ఫామ్ లేమి కారణంగా టాప్-10లో స్థానం కోల్పోయూ. తరచూ కోచ్‌లను వూర్చడం వల్ల కూడా నాకు కలిసి రాలేదు. ఈ పరిస్థితుల్లో నా గురించి అంతా తెలిసిన టాటా అకాడమీ చీఫ్ కోచ్ ధర్మేంద్ర దగ్గర వుళ్లీ శిక్షణ తీసుకున్నా. కొత్త విల్లుతో కాకుండా పాత దానితో సాధన చేసి వుంచి ఫలితాలు సాధించా’ అని భారత ఆర్చరీ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) అధ్యక్షుడు వీకే మల్హోత్రా నివాసంలో జరిగిన సన్మాన కార్యక్రవుంలో దీపిక కువూరి చెప్పింది. ప్రపంచకప్‌తో మునుపటి నైపుణ్యాన్ని సాధించిన దీపిక లక్ష్యం ఇప్పుడు ఆసియా క్రీడలు.

దక్షిణ కొరియూలోని ఇంచియూన్‌లో వచ్చే నెల 19 నుంచి మెుదలయ్యే ఈ క్రీడల కోసం దీపిక తీవ్రంగా సాధన చేస్తోంది. ‘ప్రపంచకప్‌తో పోలిస్తే ఏషియూడ్ భిన్నమైనది. ఇది చాలా క్లిష్టమైనది. కొరియూ, చైనీస్ తైపీ, జపాన్, చైనా లాంటి జట్లు ఆసియూ క్రీడల్లో బరిలోకి దిగుతారు. పతకం గెలుస్తానని నేను చెప్పలేకపోరుునా వుంచి ప్రదర్శనను కొనసాగిస్తా. ఈ క్రీడల్లో ఆశావహ దృక్పథంతో బరిలోకి దిగుతా’ అని దీపిక తెలిపింది. ఇక ఆసియూ క్రీడలకు సన్నాహకంగా  భారత కాంపౌండ్, రికర్వ్ ఆర్చర్లు దక్షిణ కొరియూ వాతావరణానికి అలవాటు పడేందుకు గ్వాంగ్జూకు ఈ నెల 28న బయుల్దేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు ఆర్చర్లు అక్కడే సాధన చేస్తారు.

మరిన్ని వార్తలు