ఏంటి నీ వేషాలు.. కోహ్లితో చెప్పాలా?

3 Apr, 2020 14:29 IST|Sakshi

నీ అవసరం మాకు లేదు:  రోహిత్‌

ముంబై:  ఈ ఏడాది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) జరుగుతుందా.. లేదా అనేది పక్కన పెడితే అటు బీసీసీఐలోనూ, ఇటు ఆటగాళ్లలోనూ ఇం​కా ఆశలు మాత్రం అలానే ఉన్నాయి. కరోనా వైరస్‌ కారణంగా ఏప్రిల్‌ 15వ తేదీ నాటికి పరిస్థితులు అనుకూలించకపోయినా ప్లాన్‌-బి ప్రకారం జూన్‌-సెప్టెంబర్‌లో ఈ లీగ్‌ నిర్వహించడానికి బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది.  ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, ఆ జట్టు పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ చాట్‌లో భాగంగా వీరిద్దరూ ఐపీఎల్‌ ముచ్చటనే ఎక్కువగా మాట్లాడుకున్నారు.

ఈ సీజన్‌ ఐపీఎల్‌ వేలంలో ముంబై ఇండియన్స్‌ కొనుగోలు చేసిన ట్రెంట్‌ బౌల్ట్‌ గురించి బుమ్రాతో చర్చించాడు రోహిత్‌. బౌల్ట్‌తో కలిసి బౌలింగ్‌ ఎన్‌కౌంటర్‌ ఎలా ఉండబోతుందనే విషయం వీరి సంభాషణలో ప్రస్తావనకు వచ్చింది. ఇదిలా ఉంచితే, వీరి సంభాషణ మధ్యలో దూరిపోయిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ) స్పిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌.. తనను మిస్‌ అవుతున్నారా అంటు చమత్కరించాడు. ఇంకో అడుగు ముందుకేసి మరీ ముంబై ఇండియన్స్‌ ఏమైనా నన్ను మిస్‌ అవుతుందా’అని రోహిత్‌ను ఆట పట్టించే యత్నం చేశాడు. దానికి రోహిత్‌ కూడా చిలిపిగానే జవాబిచ్చాడు. (రోహిత్‌కు చిర్రెత్తుకొచ్చిన వేళ..)

‘నీ గురించి ఆర్సీబీకి చెబుతాం.. ముంబై ఇండియన్స్‌ జట్టుకు ఆడాలనుకుంటున్నావని మీ ఫ్రాంచైజీ యాజమాన్యానికి తెలియజేస్తాం. నీ వేషాలు మీ కెప్టెన్‌ కోహ్లి కూడా చెబుతా. అయినా నిన్ను మిస్‌ అవ్వాల్సిన అవసరం మా జట్టుకు లేదే. మేము గెలవకపోతే నిన్ను మిస్‌ అయినట్లు. మరి మేము గెలుస్తున్నాం కదా.. అటువంటప్పుడు నిన్ను ఎందుకు మిస్‌ అవుతున్నామని అనుకోవాలి. నీ అవసరం మాకు లేదు కదా. నువ్వు  బెంగళూరులోనే ఉండు. మా దగ్గరికి రావొద్దు ’ అని రోహిత్‌ సరదాగా సమాధానమిచ్చాడు. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా