102 ట్రోఫీలు... 102 వ్యక్తులకు విక్రయించి...

8 Apr, 2020 01:57 IST|Sakshi

భారత జూనియర్‌ గోల్ఫర్‌ అర్జున్‌ భాటి వినూత్న వితరణ

రూ. 4 లక్షల 30 వేలు పీఎం–కేర్స్‌ ఫండ్‌కు అందజేత

న్యూఢిల్లీ: వయోభేదం లేకుండా... సీనియర్, జూనియర్‌ అనే తేడా లేకుండా... జాతీయ, అంతర్జాతీయస్థాయి హోదా పట్టించుకోకుండా... కరోనా మహమ్మారిని ఓడించడానికి... ఈ పోరాటంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తమవంతుగా భారత క్రీడాకారులందరూ చేయూతనిస్తున్నారు. ఇటీవల తెలంగాణకు చెందిన 15 ఏళ్ల షూటర్‌ ఇషాసింగ్‌ తాను దాచుకున్న రూ. 30 వేలను ప్రధాన మంత్రి సహాయనిధికి అందజేయగా... గ్రేటర్‌ నోయిడాకు చెందిన 15 ఏళ్ల భారత జూనియర్‌ గోల్ఫ్‌ క్రీడాకారుడు అర్జున్‌ భాటి వినూత్న పద్ధతిలో వితరణ మొత్తాన్ని సేకరించాడు.

జూనియర్‌స్థాయిలో మూడుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన అర్జున్‌ భాటి క్రీడాకారుడిగా గత ఎనిమిదేళ్లలో జాతీయ, అంతర్జాతీయస్థాయిలో 150 టోర్నమెంట్‌లలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో తాను గెల్చుకున్న 102 ట్రోఫీలను 102 వ్యక్తులకు విక్రయించాడు. ఈ విక్రయాల ద్వారా వచ్చిన మొత్తం రూ. 4 లక్షల 30 వేలను ప్రధానమంత్రి సహాయనిధికి విరాళం ఇచ్చి ఆదర్శంగా నిలిచాడు. అంతకుముందు అర్జున్‌ అమ్మమ్మ తన ఏడాది పెన్షన్‌ మొత్తాన్ని (రూ. 2,06,148) పీఎం కేర్స్‌ ఫండ్‌కు విరాళంగా ఇవ్వడం విశేషం.

మరిన్ని వార్తలు