అర్జున్‌కు ఐదు వికెట్లు 

20 Dec, 2017 00:21 IST|Sakshi

ముంబై: భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌ దేశవాళీ అండర్‌–19 కూచ్‌ బెహర్‌ ట్రోఫీలో సత్తాచాటాడు. రైల్వేస్‌తో జరిగిన నాలుగు రోజుల మ్యాచ్‌లో ఎడంచేతి వాటం పేసర్‌ అర్జున్‌ రెండో ఇన్నింగ్స్‌లో 44 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. అర్జున్‌ ధాటికి రైల్వేస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 136 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇన్నింగ్స్‌ 103 పరుగుల తేడాతో గెలిచింది.

తొలి ఇన్నింగ్స్‌లో 23 పరుగులిచ్చి ఒక్క వికెట్‌ తీయలేకపోయిన అర్జున్‌ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం హడలెత్తించాడు. అంతకుముందు ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 389 పరుగులు సాధించగా... రైల్వేస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌటైంది. ఇదే టోర్నీలో మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జున్‌ మూడు వికెట్లు... అస్సాంతో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టాడు.    

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు