ఆసియా జిమ్నాస్టిక్స్‌కు అరుణ

23 Apr, 2017 01:50 IST|Sakshi
ఆసియా జిమ్నాస్టిక్స్‌కు అరుణ

ఆసియా జిమ్నాస్టిక్స్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టులో హైదరాబాద్‌ అమ్మాయి బుద్దా అరుణా రెడ్డి చోటు సంపాదించింది. వచ్చే నెల 13 నుంచి 23 వరకు బ్యాంకాక్‌లో ఈ  పోటీలు జరుగుతాయి. గత ఫిబ్రవరిలో ఆలిండియా యూనివర్సిటీ చాంపియన్‌షిప్‌లో ఉస్మానియా యూనివర్సిటీకి ప్రాతినిధ్యం వహించిన 20 ఏళ్ల అరుణా రెడ్డి మూడు స్వర్ణాలు గెలిచింది.

ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ జ్యోతిక శ్రీకి స్వర్ణం
జాతీయ యూత్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు తొలి స్వర్ణం లభించింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి డి. జ్యోతిక శ్రీ 400 మీటర్ల రేసులో పసిడి పతకాన్ని సాధించింది. ఆమె 56.7 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానాన్ని సంపాదించింది.

మరిన్ని వార్తలు