ఆసీస్‌ దీటైన జవాబు 

16 Dec, 2017 01:07 IST|Sakshi

స్మిత్‌ 92 బ్యాటింగ్‌

ఇంగ్లండ్‌ 403 ఆలౌట్‌

బెయిర్‌స్టో సెంచరీ 

పెర్త్‌: యాషెస్‌ సిరీస్‌ మూడో టెస్టులో ఇంగ్లండ్‌ మళ్లీ తడబడింది. రెండో రోజు వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. ఓవర్‌నైట్‌ స్కోరు 305/4తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లండ్‌ మరో 98 పరుగులు జోడించి మిగతా ఆరు వికెట్లు కోల్పోయింది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 203 పరుగులు సాధించింది. కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (92 బ్యాటింగ్‌; 14 ఫోర్లు, 1 సిక్స్‌) మరోసారి జట్టును ముందుండి నడిపించాడు.  

అంతకుముందు ఇంగ్లండ్‌ జట్టు మలాన్‌ (140; 19 ఫోర్లు, 1 సిక్స్‌), బెయిర్‌స్టో (119; 18 ఫోర్లు)ల అద్భుత బ్యాటింగ్‌తో ఓ దశలో 368/4తో పటిష్ట స్థితిలో నిలిచి భారీ స్కోరుపై కన్నేసింది. మలాన్‌ను స్పిన్నర్‌ లయన్‌ అవుట్‌ చేయడం... అనంతరం వచ్చిన వారు వచ్చినట్లు వెనుదిరగడంతో ఇంగ్లండ్‌ తమ చివరి ఆరు వికెట్లను 35 పరుగుల తేడాలో కోల్పోయింది. స్టార్క్‌కు 4, హాజల్‌వుడ్‌కు 3 వికెట్లు దక్కాయి. 

మరిన్ని వార్తలు