భజ్జీ రికార్డుపై కన్నేసిన అశ్విన్‌

16 Oct, 2019 14:03 IST|Sakshi

ఢిల్లీ : టీమిండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో అద్భుతంగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సిరీస్‌లో అశ్విన్‌ 14 వికెట్లు పడగొట్టాడు. శనివారం నుంచి రాంచీలో జరగనున్న మూడో టెస్టులో మరో తొమ్మిది వికెట్లు పడగొడితే దక్షిణాఫ్రికాపై టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో భారత బౌలగా నిలుస్తాడు. భారత జట్టు తరపున దక్షిణాఫ్రికాపై ఇప్పటికే లెజెండరీ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే 21 టెస్టుల్లో 84 వికెట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మాజీ పేసర్‌ జగవల్‌ శ్రీనాథ్‌ 13 టెస్టుల్లో 64 వికెట్లతో రెండో స్థానంలో నిలవగా, భజ్జీ 11 టెస్టుల్లో 60 వికెట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక రవిచంద్రన్‌ అశ్విన్‌ 9 టెస్టుల్లో 52 వికెట్లు తీసీ నాలుగో స్థానంలో ఉన్నాడు. 

ఈ నేపథ్యంలో రాంచీ వేదికగా జరగనున్న మూడో టెస్టులో మరో 9 వికెట్లు తీస్తే హర్బజన్‌సింగ్‌ని అధిగమించి మూడో స్థానానికి చేరుకుంటాడు. ఇక మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ జహీర్‌ఖాన్‌పై 12 టెస్టుల్లో 40 వికెట్లు పడగొట్టాడు. కాగా, ఈ సిరీస్‌లో భారత్‌ సంపూర్ణాదిపత్యం ప్రదర్శిస్తూ ఇప్పటికే 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక మూడో టెస్టులోనూ గెలిచి దక్షిణాఫ్రికాను వైట్‌వాష్‌ చేసి టెస్టు చాంపియన్‌షిప్‌లో మరింత ముందుకు వెళ్లాలని టీమిండియా భావిస్తుంది. కోహ్లిసేన ప్రస్తుతం 200 పాయింట్లతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు