కష్టాల్లో ఇంగ్లండ్‌

3 Aug, 2018 17:47 IST|Sakshi

బర్మింగ్‌హామ్‌: టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్‌ కష్టాల్లో పడింది. 9/1 ఓవర్‌నైట్‌ స్కోరుతో శుక్రవారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లండ్‌.. భారత బౌలర్ల దెబ్బకు అపసోపాలు పడుతోంది. ఈ రోజు ఆటలో కీటన్‌ జెన్నింగ్స్‌(8) వికెట్‌ను ఆదిలోనే తీసిన భారత్‌.. ఆపై స్వల్ప విరామాల్లో జో రూట్‌(14), మాలన్‌(20), బెయిర్‌ స్టో(28), బెన్‌ స్టోక్స్‌(6) వికెట్లను సాధించింది. దాంతో ఇంగ్లండ్‌ తన రెండో ఇన్నింగ్స్‌లో 86 పరుగుల వద్ద ఆరో వికెట్‌ను కోల్పోయి ఇబ్బందుల్లో పడింది.

ముందుగా ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ను అశ్విన్‌ కకావికలం చేయగా, అటు తర్వాత ఇషాంత్‌ శర్మ విజృంభించి బౌలింగ్‌ చేశాడు. ఇంగ్లండ్‌ కోల్పోయిన ఆరు వికెట్లలో రవి చంద‍్రన్‌ అశ్విన్‌, ఇషాంత్‌ శర్మలు తలో మూడు వికెట్లు సాధించారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ 99 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 287 పరుగులకు ఆలౌట్‌ కాగా, భారత్‌ తన మొదటి ఇన్నింగ్స్‌లో 274 పరుగులు చేసింది.

చదవండి: 'సర్‌' విరాట్‌

సచిన్‌ రికార్డ్‌ మళ్లీ బ్రేక్‌ చేసిన కోహ్లి

మరిన్ని వార్తలు