అశ్విన్ జిగేల్... ఇంగ్లండ్ ఢమాల్

19 Nov, 2016 06:39 IST|Sakshi
అశ్విన్ జిగేల్... ఇంగ్లండ్ ఢమాల్

ఒక్క రోజులో 11 వికెట్లు
ఫాలోఆన్ దిశగా ఇంగ్లండ్
అశ్విన్ ఆల్‌రౌండ్ ప్రదర్శన
రెండో టెస్టుపై పట్టు బిగించిన భారత్ 

టెస్టుల్లో నంబర్‌వన్ ఆల్‌రౌండర్ ర్యాంక్‌కు అసలైన అర్హత తనకే ఉందని భారత క్రికెటర్ అశ్విన్ నిరూపించాడు. బ్యాటింగ్ చేయడానికి కష్టంగా ఉన్న పిచ్‌పై అద్భుత ఇన్నింగ్‌‌స ఆడి అర్ధసెంచరీ చేయడంతో పాటు... తనకు అనుకూలంగా ఉన్న పిచ్‌పై ప్రతి బంతికీ ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించాడు. ఫలితంగా ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో రెండో రోజుకే భారత్ పూర్తిగా పట్టు సాధించింది.

తొలి టెస్టు తర్వాత అంతులేని ఆత్మవిశ్వాసంతో కనిపించిన ఇంగ్లండ్ జట్టు వైజాగ్‌లో డీలా పడింది. భారత బ్యాట్స్‌మెన్‌ను నిలువరించలేక బౌలర్లు చేతులెత్తేస్తే... స్పిన్‌ను ఆడటానికి ఆ జట్టు బ్యాట్స్‌మెన్ బ్రేక్ డ్యాన్సే చేయాల్సి వస్తోంది. ఇప్పటికే సగం వికెట్లు కోల్పోరుున పర్యాటక జట్టు ఇక ఫాలోఆన్ తప్పించుకోవాలంటే అద్భుతం జరగాల్సిందే. 

విశాఖపట్నం నుంచి సాక్షి క్రీడా ప్రతినిధి
ఊహించినట్లే జరుగుతోంది.... అరంగేట్ర టెస్టు ద్వారా విశాఖపట్నం భారత జట్టుకు శుభారంభాన్ని ఇవ్వబోతోంది. రెండో రోజు సాయంత్రం నుంచే బంతి తిరుగుతుండటంతో ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో భారత్ విజయంపై ఆశలు పెంచుకుంది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో రెండో రోజు ఏకంగా 11 వికెట్లు నేలకూలారుు. శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్‌‌సలో 49 ఓవర్లలో 5 వికెట్లకు 103 పరుగులు చేసింది. జో రూట్ (98 బంతుల్లో 53; 6 ఫోర్లు) మినహా ప్రధాన బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యారు. స్టోక్స్ (12 బ్యాటింగ్), బెరుుర్‌స్టో (12 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో అశ్విన్ రెండు వికెట్లు తీసుకోగా... షమీ, జయంత్ యాదవ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్‌‌సలో 129.4 ఓవర్లలో 455 పరుగులకు ఆలౌటరుుంది. కెప్టెన్ విరాట్ కోహ్లి (267 బంతుల్లో 167; 18 ఫోర్లు) రెండోరోజు ఎక్కువసేపు నిలబడకపోరుునా... అశ్విన్ (95 బంతుల్లో 58; 6 ఫోర్లు) నాణ్యమైన ఇన్నింగ్‌‌స ఆడాడు. తొలి టెస్టు ఆడుతోన్న జయంత్ యాదవ్ (84 బంతుల్లో 35; 3 ఫోర్లు) కూడా రాణించాడు. అశ్విన్, జయంత్ ఎనిమిదో వికెట్‌కు 64 పరుగులు జోడించడం విశేషం. ఇంగ్లండ్ బౌలర్లలో మొరుున్ అలీ, అండర్సన్ మూడేసి వికెట్లు తీసుకోగా... రషీద్‌కు రెండు వికెట్లు దక్కారుు. ప్రస్తుతం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్‌‌సలో 352 పరుగులు వెనుకబడి ఉంది. ఫాలోఆన్ తప్పిం చుకోవాలంటే కుక్ బృందం మరో 153 పరుగులు చేయాలి.

సెషన్ 1: అశ్విన్ నిలకడ
రెండో రోజును అశ్విన్, కోహ్లి ధాటిగానే ప్రారంభించారు. ఇద్దరూ అడపాదడపా బౌండరీలతో నిలకడగా ఆడారు. అశ్విన్ 17 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇచ్చిన క్యాచ్‌ను స్టోక్స్ వదిలేశాడు. అరుుతే మొరుున్ బౌలింగ్‌లో తర్వాతి బంతికే కోహ్లి ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్స్‌లో స్టోక్స్ అద్భుతంగా అందుకున్నాడు. మరో మూడు ఓవర్ల తర్వాత భారత్‌కు మరో షాక్ తగిలింది. మొరుున్ బౌలింగ్‌లో సాహా, జడేజా మూడు బంతుల వ్యవధిలో ఎల్బీగా అవుటయ్యారు. సాహా అవుట్ నిర్ణయాన్ని భారత్ రివ్యూ చేసినా ఫలితం లేకపోరుుంది. తొలి టెస్టు ఆడుతున్న జయంత్ యాదవ్ రూపంలో అశ్విన్‌కు మంచి సహకారం లభించింది. వీళ్లిదరూ జాగ్రత్తగా ఆడుతూనే మధ్యలో బౌండరీలతో పరుగులు రాబట్టారు. మూడు వికెట్లు పడ్డా... ఈ సెషన్‌లో అశ్విన్ నిలకడ, పరుగులు వేగంగా రావడం వల్ల భారత్‌దే పైచేరుుగా కనిపించింది.  ఓవర్లు: 29 పరుగులు: 98 వికెట్లు: 3

సెషన్ 2: భారత్ ఆలౌట్
లంచ్ తర్వాత మొరుున్ బౌలింగ్‌లో బౌండరీతో అశ్విన్ 86 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అదే జోరులో మరో బౌండరీ కొట్టిన అశ్విన్.. స్టోక్స్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మరో ఎండ్‌లో నాణ్యమైన ఇన్నింగ్‌‌స ఆడిన జయంత్ యాదవ్ భారీ షాట్ కొట్టబోరుు క్యాచ్ ఇచ్చాడు. ఉమేశ్ యాదవ్ రెండు ఫోర్లు, షమీ ఒక సిక్సర్‌తో వేగంగా ఆడారు. రషీద్ బౌలింగ్‌లో ఉమేశ్ అవుట్ కావడంతో భారత ఇన్నింగ్‌‌సకు తెరపడింది. అనంతరం ఇన్నింగ్‌‌స ప్రారంభించిన ఇంగ్లండ్‌కు మూడో ఓవర్లోనే షాక్ తగిలింది. షమీ కళ్లు చెదిరే బంతితో కుక్‌ను బౌల్డ్ చేశాడు. హమీద్, రూట్ ఆచితూచి ఆడారు. దీంతో ఏడో ఓవర్‌లో గానీ ఇంగ్లండ్‌కు బౌండరీ రాలేదు. రూట్ అడపాదడపా బౌండరీలు కొట్టినా హమీద్ పూర్తిగా ఆత్మరక్షణలో ఆడాడు. ఈ ఇద్దరూ జాగ్రత్తగా ఆడటంతో మరో వికెట్ పడకుండా సెషన్ ముగిసింది.
ఓవర్లు: 26.4 పరుగులు: 74 వికెట్లు: 4
భారత్: 10.4 ఓవర్లు, 40 పరుగులు, 3 వికెట్లు
ఇంగ్లండ్: 16 ఓవర్లు, 34 పరుగులు, 1 వికెట్

సెషన్ 3: భారత బౌలర్ల హవా
టీ తర్వాత కొద్దిసేపటికే రూట్‌తో సమన్వయ లోపంతో హమీద్ రనౌట్ అయ్యాడు. ధోని స్టరుుల్‌లో సాహా బంతిని వెనకకు విసిరి రనౌట్ చేశాడు. భారత స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొన్న రూట్ బౌండరీలతో వేగం పెంచాడు. కానీ అశ్విన్ బౌలింగ్‌లో డకెట్ బౌల్డ్ కావడంతో మరోసారి ఇంగ్లండ్ తడబడింది. 91 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న రూట్... అశ్విన్ బౌలింగ్‌లో ఎదురుదాడి ప్రయత్నం చేసి అవుటయ్యాడు. కొత్త బౌలర్ జయంత్ యాదవ్ తన రెండో ఓవర్లోనే మొరుున్ అలీని అవుట్ చేశాడు. తొలుత అంపైర్ అవుట్ ఇవ్వకపోరుునా రివ్యూ అడిగి భారత జట్టు వికెట్ సాధించింది. స్టోక్స్, బెరుుర్‌స్టో కలిసి జాగ్రత్తగా ఆడి భారత్‌కు మరో వికెట్ ఇవ్వకుండా సెషన్‌ను ముగించారు. ఓవర్లు: 33 పరుగులు: 69 వికెట్లు: 4

నేడా..? రేపా..?
విశాఖ టెస్టులో రెండో రోజు ముగిసేసరికి భారత జట్టు విజయం దాదాపుగా ఖాయమైంది. ఇక ఈ మ్యాచ్‌ను ఇంగ్లండ్ జట్టు ఆఖరి రోజు వరకు తీసుకెళ్లడం కూడా కష్టమే. ప్రస్తుతం ఇంగ్లండ్ ఫాలోఆన్ తప్పించుకోవాలంటే మరో 153 పరుగులు చేయాలి. క్రీజులో ఉన్న ఇద్దరు తప్ప స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ ఎవరూ లేరు. ప్రస్తుతం బంతి తిరుగుతున్న విధానం చూస్తే మూడోరోజు మరింత స్పిన్ తిరిగే అవకాశం కనిపిస్తోంది. అశ్విన్‌తో పాటు కొత్త స్పిన్నర్ జయంత్ కూడా ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి మూడో రోజు ఉదయం సెషన్‌లోనే ఇంగ్లండ్ ఆలౌటయ్యే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ భారత్‌కు 250 పైచిలుకు ఆధిక్యం లభిస్తే ఇంగ్లండ్‌ను ఫాలోఆన్ ఆడించవచ్చు. అంతకంటే తక్కువ ఆధిక్యం వస్తే భారత్ రెండో ఇన్నింగ్‌‌స ఆడే అవకాశం లేకపోలేదు. ఫాలోఆన్ ఆడిస్తే ఒకవేళ ఇంగ్లండ్ జట్టు రెండో ఇన్నింగ్‌‌సలో పోరాడి భారత్‌కు ఏ 150 పరుగుల లక్ష్యం నిర్దేశించినా ఆఖరి రోజు వరకూ ఆట వెళుతుంది. అప్పుడు స్పిన్ పిచ్‌పై అది ఛేదించడానికి కష్టపడాలి. అరుుతే అశ్విన్ జోరు చూస్తుంటే భారత్‌కు మంచి ఆధిక్యం లభించి ఫాలోఆన్ ఆడించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నారుు. అదే జరిగితే మ్యాచ్ శనివారమే ముగిసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఒకవేళ ఇంగ్లండ్ పోరాడినా నాలుగో రోజు ఆదివారం నాటికి మ్యాచ్‌లో ఫలితం వచ్చే అవకాశం ఉంది. కోహ్లి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ప్రస్తుతం భారత్ విజయం ఖాయమే అనిపిస్తోంది. అరుుతే ఇది నేడే పూర్తవుతుందా? లేక రేపా అనేదే తేలాలి. 

2 ఆసియా ఖండంలో ఇంగ్లండ్ కెప్టెన్ కుక్ పేస్ బౌలర్ బౌలింగ్‌లో బౌల్డ్ కావడం ఇది రెండోసారి మాత్రమే. 2006లో భారత్‌పై తన అరంగేట్ర టెస్టు మ్యాచ్‌లో తొలిసారి అతను ఇర్ఫాన్ పఠాన్ బౌలింగ్‌లో   బౌల్డయ్యాడు.

8 భారత్‌పై ఆడిన 12 ఇన్నింగ్‌‌సలో రూట్ ఎనిమిదిసార్లు 50 అంతకంటే ఎక్కువ పరుగులు చేశాడు. ఏ జట్టుపై కూడా రూట్ ఈస్థారుులో నిలకడగా రాణించలేదు.

>
మరిన్ని వార్తలు