‘ఇదేందయ్య ఇది.. నేనెప్పుడు చూడలేదు’

31 May, 2020 11:06 IST|Sakshi

చెన్నై: టీమిండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ షేర్‌ చేసిన ఓ ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.  కొందరు  యువకులు చేసిన టిక్‌టాక్‌ వీడియోను తన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ ‘నవ్వు ఆపుకోలేకపోతున్నాను’ అంటూ కామెంట్‌ చేశాడు. ఇంతకీ ఆ వీడియో ఏముందంటే.. కొందరు యువకులు క్రికెట్‌ ఆడుతూ డీఆర్‌ఎస్‌ విధానాన్ని అనుకరిస్తూ ఓ ఫన్నీ స్కిట్‌ చేస్తారు. అధికారిక క్రికెట్‌ మ్యాచ్‌లో డీఆర్‌ఎస్‌ సమీక్ష కోరినప్పుడు ఎలాంటి సన్నివేశాలు చోటుచేసుకుంటాయో కళ్లకు కట్టినట్టు తమదైన శైలిలో సరదాగా చూపించారు. ఎంతో ఫన్నీగా ఉన్న ఆ వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. (ఇకపై కరోనా సబ్‌స్టిట్యూట్‌?)

‘దీన్ని అధిగమించలేము .. దీన్ని ఎలా క్యాప్షన్ చేయాలో కూడా తెలియదు’ అంటూ రవిచంద్రన్‌ అశ్విన్‌ తను షేర్‌ చేసిన వీడియోకు మరో కామెంట్‌ను జతచేశాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో డీఆర్‌ఎస్‌ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ విధానంపై అనేక జోక్స్‌, మీమ్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. అంతేకాకుండా డీఆర్‌ఎస్‌లోని  అనేక లోటుపాట్లను ఎత్తిచూపుతూ ఆటగాళ్లు, క్రికెట్‌ బోర్డులు విమర్శించడం కూడా వార్తల్లో వచ్చిన విషయం తెలిసిందే. ఇక లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన అశ్విన్‌ సోషల్‌ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉంటాడు. సహచర క్రికెటర్లతో ఇన్‌స్టా లైవ్‌ లో పాల్గొంటూ అభిమానులను అలరిస్తున్నాడు. (‘ఖేల్‌రత్న’కు రోహిత్‌ శర్మ పేరు సిఫారసు) 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా