అశ్విన్‌ చెత్త రికార్డు

16 Jan, 2018 20:25 IST|Sakshi

సెంచూరియన్‌: టీమిండియా స్పిన్నర్‌ రవి చంద్రన్‌ అశ్విన్‌ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్‌ వికెట్‌ తీయడానికి సంధించిన బంతులు 177(29.3 ఓవర్లు). తద్వారా విదేశీ పిచ్‌లపై రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌ తీయడానికి అశ్విన్‌ అత్యధిక బంతుల్ని తీసుకున్న అపప్రథను సొంతం చేసుకున్నాడు. ఓవరాల్‌గా చూస్తే ఇది అశ్విన్‌కు మూడో చెత్త ప్రదర్శనగా చెప్పొచ్చు. అంతకుముందు 2012లో అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో అశ్విన్‌ వికెట్‌ తీయడానికి 257 బంతులు అవసరం కాగా, 2011లో వెస్టిండీస్‌తో కోల్‌కతాలో జరిగిన మ్యాచ్‌లో వికెట్‌ తీయడానికి 215 బంతులు అవసరమయ్యాయి.


ఈ మ్యాచ్‌లో 287 పరుగుల లక్ష్యాన్ని భారత్‌కు నిర్దేశించింది.  నాల్గో రోజు ఆటలో భాగంగా దక్షిణాఫ్రికా తన రెండో ఇన్నింగ్స్‌లో 258 పరుగుల వద్ద ఆలౌటైంది. 90/2 ఓవర్‌ నైట్‌ స్కోరుతో మంగళవారం ఇన్నింగ్స్‌ కొనసాగించిన సఫారీలు.. మరో 168 పరుగులు జోడించి మిగతా ఎనిమిది వికెట్లు కోల్పోయారు. దాంతో సఫారీలకు 286 పరుగుల ఆధిక్యం లభించింది. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో ఎన్‌గిడి చివరి వికెట్‌గా అశ్విన్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు.

మరిన్ని వార్తలు