స్వప్నకు రజతం 

24 Apr, 2019 01:10 IST|Sakshi

దోహా: ఆసియా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో మూడో రోజు భారత్‌కు మూడు పతకాలు లభించాయి. ఏడు అంశాల సమాహారమైన హెప్టాథ్లాన్‌లో భారత అ మ్మాయి స్వప్నా బర్మన్‌ రెండో స్థానంలో నిలిచి రజత పతకం గెలిచింది. లాంగ్‌జంప్, 800 మీటర్లు, 200 మీటర్లు, షాట్‌పుట్, 100 మీటర్ల హర్డిల్స్, హైజంప్, జావెలిన్‌ త్రో అంశాల్లో పోటీపడిన స్వప్నా బర్మన్‌ మొత్తం 5993 పాయింట్లు స్కోరు చేసింది. ఉజ్బెకిస్తాన్‌ అమ్మాయి ఎకతెరీనా వొర్నినా (6198 పాయి ంట్లు) స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.

భారత్‌కే చెందిన పూర్ణిమ హెంబ్రామ్‌ (5528 పాయింట్లు) ఐదో స్థానంలో నిలిచింది. 4గీ400 మీటర్ల మిక్స్‌డ్‌ రిలేలో మొహమ్మద్‌ అనస్, పూవమ్మ, విస్మయ, అరోకియా రాజీవ్‌లతో కూడిన భారత బృందం 3 నిమిషాల 16.71 సెకన్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని దక్కించుకుంది. మహిళల 10000 మీటర్ల రేసులో సంజీవని 32ని:44.96 సెకన్లలో గమ్యానికి చేరి కాంస్య పతకాన్ని గెలిచింది.  మహిళల 200 మీటర్ల విభాగంలో ద్యుతీ చంద్‌ సెమీఫైనల్‌కు... పురుషుల 1500 మీటర్ల విభాగంలో అజయ్‌ కుమార్‌ సరోజ్‌ ఫైనల్‌కు అర్హత సాధించారు.  

మరిన్ని వార్తలు