ప్రిక్వార్టర్స్‌లో వికాస్ ఆసియా బాక్సింగ్

4 Jul, 2013 06:21 IST|Sakshi

 న్యూఢిల్లీ: ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ వికాస్ మాలిక్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. జోర్డాన్‌లో జరుగుతున్న ఈ పోటీల్లో బుధవారం జరిగిన 60 కేజీల బౌట్‌లో జాతీయ చాంపియన్ వికాస్... నూరిస్థాన్ ఖైబర్ (అప్ఘానిస్థాన్)పై విజయం సాధించాడు.
 
 తొలిసారి ఈ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగిన వికాస్ తన ‘పంచ్’ పవర్‌తో ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టించాడు. గురువారం జరిగే ప్రిక్వార్టర్స్‌లో ఒలింపియన్ యున్‌సోవ్ అన్వర్ (తజకిస్థాన్)తో వికాస్ తలపడతాడు. మరోవైపు లైట్ హెవీ వెయిట్ (81 కేజీల) తొలి రౌండ్‌లో జగ్‌రూప్ సింగ్... బుబర్‌బెక్ యుల్దషేవ్ (ఉజ్బెకిస్థాన్) చేతిలో ఓడాడు.
 

మరిన్ని వార్తలు