కొరియాతో భారత్ అమీతుమీ

29 Oct, 2016 00:20 IST|Sakshi
కొరియాతో భారత్ అమీతుమీ

ఆసియా చాంపియన్‌‌ ట్రోఫీ హాకీ సెమీస్ నేడు 


క్వాంటన్ (మలేసియా): లీగ్ దశలో కనబరిచిన జోరును నాకౌట్ మ్యాచ్‌లోనూ పునరావృతం చేయాలనే పట్టుదలతో భారత హాకీ జట్టు ఆసియా చాంపియన్‌‌స ట్రోఫీ సెమీస్‌కు సమాయాత్తం అరుుంది. దక్షిణ కొరియాతో శనివారం జరిగే మ్యాచ్‌లో భారత్ తలపడనుంది. లీగ్ దశలో కొరియాతో జరిగిన మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకున్న భారత్ ఈ నాకౌట్ పోరులో మాత్రం విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. కెప్టెన్, గోల్‌కీపర్ శ్రీజేష్ గాయం నుంచి కోలుకోకపోవడం, డిఫెండర్ సురేందర్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు పడటం భారత శిబిరానికి ఆం దోళన కలిగిస్తోంది.

అరుుతే రూపిందర్ పాల్ సింగ్, జస్జీత్, ఆకాశ్‌దీప్, రమణ్‌దీప్ సింగ్, సర్దార్ సింగ్ సమన్వయంతో ఆడితే మాత్రం భారత్‌కు విజయం దక్కడం కష్టమేమీకాదు. శ్రీజేష్ స్థానంలో గోల్‌కీపింగ్ చేస్తున్న ఆకాశ్ కూడా అద్భుతంగా ఆడుతున్నాడు. మలేసియా తో జరిగిన మ్యాచ్‌లో చివరి సెకన్లలో ఆకాశ్ ప్రత్యర్థి జట్టు పెనాల్టీ కార్నర్‌ను అడ్డుకున్నాడు. ‘కొరియా శక్తి అంతా వారి డిఫెన్‌‌సలోనే ఉంది. వారి రక్షణశ్రేణిని దాటుకొని ముందుకు వెళ్లడంపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుంది’ అని భారత కోచ్ ఒల్ట్‌మన్‌‌స అన్నారు. మరో సెమీఫైనల్లో పాకిస్తాన్‌తో మలేసియా ఆడుతుంది. ఆదివారం ఫైనల్ జరుగుతుంది.

 

మరిన్ని వార్తలు