బాక్సింగ్‌ సెమీస్‌లో వికాస్, అమిత్‌ 

30 Aug, 2018 01:15 IST|Sakshi

ఏషియాడ్‌ బాక్సింగ్‌లో భారత్‌కు మరో రెండు పతకాలు ఖాయమయ్యాయి. బుధవారం క్వార్టర్‌ ఫైనల్స్‌లో స్టార్‌ బాక్సర్‌ వికాస్‌ కృషన్‌ (75 కేజీలు) 3–2తో చైనాకు చెందిన తుహెటా ఎర్బీక్‌ తంగ్లథియాన్‌పై నెగ్గి సెమీస్‌కు చేరాడు. అంతకుముందు జరిగిన మరో క్వార్టర్‌ ఫైనల్లో అమిత్‌ ఫంఘాల్‌ (49 కేజీలు) 5–0తో దక్షిణ కొరియా బాక్సర్‌ కిమ్‌ జాంగ్‌ ర్యాంగ్‌పై గెలుపొందాడు.

మరోవైపు మహిళల బాక్సింగ్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో సర్జుబాలా దేవి (51 కేజీలు) 0–5 తేడాతో చాంగ్‌ యువాన్‌ (చైనా) చేతిలో ఓడిపోయింది. దీంతో భారత మహిళా బాక్సర్లు పతకాలేమీ సాధించకుండా వెనుదిరిగినట్లయింది. మహిళల బాక్సింగ్‌ను ఏషియాడ్‌లో ప్రవేశపెట్టిన (2010) తర్వాత భారత్‌కు ఇలా జరగడం ఇదే మొదటిసారి. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బంగ్లాదేశ్‌పై భారత్‌ ఘన విజయం

జడేజా తిప్పేశాడు.. భువీ కూల్చేశాడు

ఈ రోజు ప్రధానాంశాలు.. ఒక్క క్లిక్‌తో

ఆసియాకప్‌: కష్టాల్లో బంగ్లాదేశ్‌

‘పాక్‌కు భయపడే కోహ్లి పారిపోయాడు’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రొమాంటిక్‌ కామెడీ

మన్మథుడు ఈజ్‌ బ్యాక్‌!

సురయ్యా.. ఆగయా

కేజీఎఫ్‌ అంటే?

అవకాశాలు రావని భయపడ్డాను

మునిగి తేలుతూ...