భారత్‌ శుభారంభం  

15 Jul, 2018 01:41 IST|Sakshi

జకార్తా: ఆసియా జూనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. శనివారం జరిగిన టీమ్‌ ఈవెంట్‌ తొలి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 5–0తో కజకిస్తాన్‌ను చిత్తు చేసింది. గ్రూప్‌ ‘సి’లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఆకర్షి కశ్యప్‌ 21–5, 21–4తో ఇయా గోర్డెయెవా (కజకిస్తాన్‌)పై గెలిచి 1–0తో ఆధిక్యం అందించింది. రెండో మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్‌ 21–15, 21–12తో దిమిత్రీ పనరిన్‌పై విజయం సాధించాడు.

మహిళల డబుల్స్‌లో సిమ్రన్‌ సింఘి–రితిక ద్వయం 21–7, 21–8తో ఇయా గొర్డెయెవా–అయేషా  జంటపై నెగ్గింది. పురుషుల డబుల్స్‌లో మన్‌జీత్‌ సింగ్‌–డింకూ సింగ్‌ జోడీ 21–5, 21–16తో అబ్దుల్లాయెవ్‌–తజిబుల్లాయెవ్‌ ద్వయంపై విజయం సాధించగా... చివరగా జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సృష్టి జూపూడి–శ్రీ కృష్ణ సాయి జంట 21–7, 21–9తో దిమిత్రీ–అయేషా జుమాబెక్‌పై గెలిచి 5–0తో విజయాన్ని పరిపూర్ణం చేశారు.  

మరిన్ని వార్తలు