మహిళా అథ్లెట్ పై ఐరన్ రాడ్ తో దాడి

23 May, 2016 10:23 IST|Sakshi

మధుర: అంతర్జాతీయ మహిళా అథ్లెట్పై ఐరన్ రాడ్తో దాడి చేసి గాయపరిచిన ఘటన ఉత్తరప్రదేశ్లోని మధురలో చోటు చేసుకుంది. ఈ ఘటనతో పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి అస్మా అల్వి(25) తీవ్రంగా గాయపడింది. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు గత కొద్దిరోజులగా ఆమెను అసభ్య పదజాలంతో వేధించడంతో ఆమె పోలీసులుకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో శనివారం అస్మా అల్విపై దాడి చేశారు. ముందుగా ఓ వ్యక్తి ...ఆమె బ్యాగ్ను గుంజుకునేందుకు యత్నించడంతో ఆమె అడ్డుకుంది.

అదే సమయంలో మరోవ్యక్తి అల్విపై ఇనుప రాడ్తో దాడి చేశాడు. దాంతో ఆమె అపస్మారకస్థితిలోకి వెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు అల్విని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి నిందితులపై కేసును నమోదు చేసి విచారణ జరుపుతున్నామని పోలీసు అధికారి అనుపమ్ సింగ్ తెలిపారు. పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. కాగా అల్విపై జరిగిన దాడిని క్రీడా సమాఖ్య ఖండించింది. నిందితులను పట్టుకొని కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేసింది. కాగా 2005లో ఉజ్బెకిస్థాన్ ఛాంపియన్ షిప్ లో అల్వి 60 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో బంగారు పథకాన్ని సాధించింది. వెయిట్ లిఫ్టింగ్లో ఆమె పలు బంగారు పతకాలు గెలుచుకుంది.

మరిన్ని వార్తలు