నిత్యకు రెండు స్వర్ణాలు

31 Aug, 2016 12:44 IST|Sakshi
నిత్యకు రెండు స్వర్ణాలు
  • ఐసీఎస్‌ఈ-ఐఎస్‌సీ స్కూల్స్ అథ్లెటిక్స్
  • హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రీజినల్ ఐసీఎస్‌ఈ- ఐఎస్‌సీ స్కూల్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో జి. నిత్య మెరిసింది. కింగ్‌కోఠి సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన ఆమె బాలికల 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్ ఈవెంట్లలో విజేతగా నిలిచింది. 100 మీటర్ల స్ప్రింట్‌లో నిత్య 12.6 సెకన్లలో పోటీని పూర్తి చేసి బంగారు పతకం గెలుపొందింది. ఈమె సహచర విద్యార్థిని కె.హర్షిత (13.5 సె.) రజతం, గీతాంజలి స్కూల్ ఆత్రే చక్రబర్తి (14.4సె.) కాంస్యం నెగ్గారు. లాంగ్‌జంప్‌లో నిత్య (4.49 మీ.) మరో స్వర్ణం గెలువగా, ఇందులోనూ హర్షిత (4.37 మీ.)రజతం నెగ్గింది. సెయింట్ ఆన్‌‌స అమ్మాయి శివిన్ (3.93 మీ.) కాంస్యం గెలుచుకుంది.

    ఇతర ఫలితాలు
    బాలికల 800 మీ. పరుగు: 1. సాక్షి జైన్, 2. నిత్యా రెడ్డి, 3. ఐశ్వర్య వడియార్; షాట్‌పుట్: 1. శ్రీవియా గణపతి, 2. విన్నీ, 3. అంకిత పచార్; డిస్కస్ త్రో: 1. తేజస్విని, 2. సలోని, 3. ధాత్రి; బాలుర 800 మీ. పరుగు: 1. ఆదిపవన్ తేజ, 2. కౌషిక్, 3. సారుు చంద్ర; లాంగ్‌జంప్: 1. షణ్ముఖ సాయితేజ, 2. కార్తీక్ సింగ్, 3. రాహుల్.

మరిన్ని వార్తలు